Beauty Tips : ఎండాకాలం లో నల్లగా అయిపోతున్నామురా బాబోయ్ అనుకునే అబ్బాయిలకోసం .. బెస్ట్ ఐడియా ఇది !

Beauty Tips : సాధారణంగా అమ్మాయిల ముఖచర్మం తో పోలిస్తే అబ్బాయిల ముఖచర్మం కొంచెం హార్డ్ గా ఉంటుందని చెప్పవచ్చు. అయితే కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలు కూడా అందంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి అబ్బాయిలు కూడా కాస్తంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా తమని తాము పట్టించుకోవడమే మానేస్తున్న నేపథ్యంలో ఎన్నో చర్మసంబంధిత సమస్యలను మగవారు కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లాప్ టాప్ ల ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల ముఖం పై మరింతగా మలినాలు పేరుకుపోవడం తో ముఖం నల్లగా , నిర్జీవంగా మారిపోతుంది..

ఇకపోతే మరీ ముఖ్యంగా ఎండాకాలంలో అబ్బాయిలు తమని తాము చూసుకొని నల్లగా మారి పోతున్నాము రా బాబు అంటూ ఇబ్బంది పడిన సందర్భాలు కూడా మనం చూసే ఉంటాం. ఇక అబ్బాయిలు అందంగా మెరవాలి అంటే కొన్ని చిట్కాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ చిట్కాలు తెలుసుకునే ముందు మీ అన్న ,తమ్ముడు ,బాబాయ్, నాన్న ఇలా ఎవరికైనా సరే..అలాగే మీ స్నేహితులకు కూడా ఈ ఆర్టికల్ ను వాట్సాప్ ద్వారా షేర్ చేయండి.. ఇక అసలు విషయానికి వస్తే.. ఎక్కువగా ముఖానికి సబ్బును ఉపయోగించకుండా మార్కెట్లో దొరికే స్కిన్ క్లెన్సర్ ను ఉపయోగించడం ఉత్తమం.

Beauty Tips in Aloe vera, green tea Peanut butter mixed
Beauty Tips in Aloe vera, green tea Peanut butter mixed

ఇక రోజుకు మూడు సార్లైనా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం వల్ల ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి ని కూడా తొలగించుకోవచ్చు. ఇక కలబంద, గ్రీన్ టీ లాంటి వాటిని ఉపయోగించి చర్మాన్ని తెల్లగా మార్చుకునే దిశగా అడుగులు వేయొచ్చు. మీ చర్మానికి ఒక టోనర్ ను ఉపయోగించడం తప్పనిసరి. కనీసం వారానికి రెండు సార్లైనా శెనగపిండితో పెరుగును కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం తెల్లగా మారడమే కాదు మొటిమలు మచ్చలు కూడా దూరమవుతాయి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఎండాకాలంలో కూడా మీ చర్మాన్ని తెల్లగా , తాజాగా ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు.