Meena Rashi : జీవితంలో ఒక్కసారి శని పట్టింది అంటే చాలు.. దాని వల్ల కలిగే నష్టాలు కూడా అంతే చెడు ప్రభావాలను కలిగిస్తూ ఉంటుంది.. కాబట్టి శని ప్రభావం వల్ల వారు ఎంతో కాలం నుంచి బాధ పడుతున్నట్లు అయితే మనం చేసే చిన్న దోష పరిహారాల నుంచి కూడా బయటపడవచ్చు. ఇకపోతే ఏప్రిల్ 29వ తేదీన శనిగ్రహం యొక్క రాశి చక్రం కూడా మారనుంది..ఇక శని కుంభ రాశి లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో కొన్ని రాశుల పై చెడు ప్రభావం చూపనుంది. ఈ సమయంలో శని రాశి సంచారం తో ధనస్సు రాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉండగా మీనరాశి వారికి అంతా చెడు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఇక ఈ శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే కొన్ని మార్గాలను సూచిస్తున్నారు.
మీరు లేదా మీకు తెలిసిన వారెవరైనా మీనరాశిలో ఉన్నట్లయితే ఈ ఆర్టికల్ ను వారికి వాట్సప్ ద్వారా షేర్ చేసి పరిహారాలను చూపించగలరు.రెండున్నర సంవత్సరాల తర్వాత మొదటి సారి శనిగ్రహం రాశి మారుతున్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని ప్రభావం మీన రాశి వారికి సుమారుగా ఏడు సంవత్సరాల పాటు దాని ప్రభావం చూపిస్తుందని సమాచారం. దీంతో నష్టాలు, కష్టాలు, బాధలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే విముక్తి పొందాలి అంటే కర్మానుసారం మీన రాశి వారిపై శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఇతరులకు దానం ఇవ్వడం, కష్టపడి పని చేసే వ్యక్తులకు సహాయం చేయడం,
నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం.. ఇలాంటి పనులు వల్ల శని ప్రభావం నుంచి కొంత వరకు బయటపడవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.ఇక తమ పై శని ప్రభావం పడిందని తెలిసినప్పుడు శనివారం రోజున ఒక పేదవాడికి నల్ల నువ్వులు, నల్ల గుడ్డ , నల్ల శనగలు వంటి వస్తువులను దానం చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. కార్మికులను, మహిళలను, దివ్యాంగుల ను ఏమాత్రం అవమానించ కుండా వారికి సహాయం చేస్తే శని యొక్క దృష్టి మనపై ఉంటుందట. ఇక హనుమంతుడికి పూజ చేయడం, రావిచెట్టు కింద ప్రతి శనివారం ఆవ నూనెతో దీపం వెలిగించడం లాంటివి చేయడం వల్ల శని ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు.