Beauty Benefits : ఈ రెండు చాలు.. ఎన్నో సౌందర్య ప్రయోజనాలు..!!

Beauty Benefits  : సాధారణంగా ప్రకృతిలో లభించే ప్రతి మూలిక కూడా ఒక ఔషధ మొక్క గా పరిగణించబడుతుంది. ముఖ్యంగా వంట ఇల్లు కూడా ఔషధాలకు పుట్టినిల్లు అని చెప్పవచ్చు.అయితే ఇలాంటి ఔషధ గుణాలు కలిగిన కేవలం రెండు పదార్థాలతో సౌందర్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇక ఆ రెండు పదార్థాలు ఏమిటి..? ఎలా సౌందర్య ప్రయోజనాలను పెంపొందించుకోవాలి అని తెలుసుకునే ముందు మీ అక్క, చెల్లి ,అత్త, అమ్మ, వదిన ఇలా ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ ను వాట్సప్ ద్వారా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇక ఆ రెండు పదార్థాలు ఏవో కాదు పసుపు, వేప ఆకు.
ఈ రెండింటి తో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

పసుపు, వేప రెండూ కూడా యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తాయి. ఈ రెండింటిలో కూడా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. వీటి నుంచి మనం అనేక రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇక ఈ రెండింటినీ కలిపి కనుక వాడినట్లయితే అనేక రకాల సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. పసుపులో ఐరన్, క్యాల్షియం, ప్రొటీన్లు, విటమిన్ ఈ, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక వేపలో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ డయాబెటీస్ వంటి గుణాలు కూడా ఉంటాయి.

These two are enough many cosmetic benefits 
These two are enough many cosmetic benefits

అందుకే వేపాకు ,పసుపు కలిపి తీసుకుంటే శరీరాన్ని మనం బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి వాటి నుంచి సులభంగా కాపాడవచ్చు.. పసుపు, వేప తో తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ దూరం అవడమే కాదు మొటిమలు కూడా తగ్గిపోతాయి. వేపాకులను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల అలర్జీలు కూడా తగ్గిపోతాయి. ఇక గాయాలపై పసుపు, వేపాకు తో తయారు చేసిన మిశ్రమాన్ని రుద్దితే ఎంత పెద్ద గాయం అయినా సరే తగ్గిపోతుంది. వేప ఆకులు వేసి నీరు ఆకుపచ్చగా మారే వరకు బాగా ఉడకబెట్టాలి. ఇప్పుడు ఆకు పచ్చగా మారిన నీటిని షాంపూ తో కలిపి జుట్టును కడగాలి . ఇలా చేస్తే చుండ్రు సమస్య కూడా దూరమవుతుంది.