Health Benefits : ఆయుష్షు పెరగాలంటే వీటిని తినాల్సిందే..!!

Health Benefits : ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు తమ జీవన విధానంలో మార్పులను చవి చూస్తున్నారు. అంతేకాదు తీసుకునే ఆహారంలో పోషకాల లోపం జీవనవిధానంలో సరైన నియమాలు పాటించకపోవడం ఇలాంటి కారణాల వల్ల వంద సంవత్సరాలు జీవించాల్సిన మనం 60 సంవత్సరాలకు అర్ధాంతరంగా మరణిస్తున్నాము. ముఖ్యంగా పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం వల్లే మన శరీరంలో అవయవాల పనితీరు కూడా దెబ్బతింటుందని చెప్పవచ్చు. అందుకే పూర్వకాలంలోని మన పెద్దవాళ్ళు సుమారుగా 100 సంవత్సరాలకు పైగానే జీవించారు. వారు అంత దీర్ఘాయుష్షుతో జీవించడానికి ఏమి చేశారు..? ఎలాంటి ఆహార పదార్థాలు తిన్నారు..? అనే విషయాలను మనం తెలుసుకుందాం.

ఇకపోతే దీర్ఘాయువు పొందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాబట్టి ఈ ఆర్టికల్ ను అందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి.తాజాగా ఈ విషయంపై పరిశోధన జరిపిన పరిశోధకులు కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది. ఒక మహిళ తన 20 సంవత్సరాల వయసులో పోషకాహారం కలిగిన ఆహారం తినడం వల్ల తన జీవిత కాలాన్ని మరో 10 సంవత్సరాలు అధికంగా పొడిగించుకోవచ్చు. అదే పురుషుడు అయితే తన 13 సంవత్సరాల వయసులో అత్యధిక పోషకాహారం తీసుకోవడం వల్ల తన జీవిత కాలాన్ని మరో పది సంవత్సరాలు పొడిగించుకోవడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అంతేకాదు ఆరోగ్యకరమైన ఆహారం వృద్ధుల జీవితకాలాన్ని పెంపొందిస్తుందట.

you have to eat these to increase your life expectancy
you have to eat these to increase your life expectancy

ప్రతి రోజూ తినే ఆహారంలో ఆకుకూరలు, పచ్చని కూరగాయలు తప్పకుండా చేర్చుకోవాలి అని వైద్యులు సైతం సలహా ఇస్తున్నారు. దీర్ఘాయుష్షు పెంపొందించుకోవాలి అంటే చిక్కుళ్లు, బఠానీలు, కాయధాన్యాల తోపాటు తృణ ధాన్యాలు, నట్స్, బాదం, జీడిపప్పు, పిస్తాల ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర అవయవాలకు కావలసిన ఆహార పదార్థాలు అంది మన ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఇక 80 సంవత్సరాల వయసున్న వృద్ధుడు ఇలాంటి ఆహారాలు తీసుకుంటే తన జీవిత కాలాన్ని మరో నాలుగు సంవత్సరాలపాటు పొడిగించుకోవచ్చు. ఇక వీటితో పాటు ఆకుకూరలు ధాన్యపు గింజలు తినడం వల్ల మన ఆయుష్షు పెరుగుతుంది.