Fruits : ఈ పండ్లు తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..?

Fruits : సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే సీజన్ కి అనుగుణం గా లభించే పండ్లను ప్రతి ఒక్కరు తినాలి అని వైద్యులు సైతం సూచిస్తూ ఉంటారు. ఇక రోజుకు కనీసం ఒకటి , రెండు పండ్లు తింటే శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఇకపోతే వేసవి కాలంలో లభించే పండ్లను ఎక్కువగా తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు.. చర్మం, జుట్టు, జీర్ణశక్తి, ఉదర సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి. ఈ పండులో లభించే ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభించడంతో పాటు బరువు తగ్గడానికి కూడా చాలా సహాయపడతాయి.ఇక డైటింగ్ చేసే వారికి కూడా ఈ పండ్లు చాలా చక్కగా పని చేస్తాయని చెప్పవచ్చు.

ఇకపోతే కొంతమంది కొన్ని పండ్లు తినేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల పూర్తిస్థాయిలో పోషకాలు శరీరానికి అందుతాయి. మరి మీలో ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తున్నట్లయితే ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్బుక్ ద్వారా అందరికీ షేర్ చేసి సమాచారాన్ని అందించగలరు. పండ్లు తినేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.ఎక్కువ ఉప్పు వేసి పండ్లను తినకూడదు.. నిజానికి చాలా మంది పండ్ల మొక్కల లో బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా వేసుకొని తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల పండ్ల యొక్క సహజ లక్షణాలు దెబ్బతింటాయి. ఇక అధిక సోడియం మీ శరీరానికి హాని కలుగజేస్తుంది.

These are the precautions to be taken while eating these fruits
These are the precautions to be taken while eating these fruits

ఇక కొంతమంది పండ్లు ఎక్కువ సమయం కంటే ముందే కట్ చేస్తారు. ఆఫీసుకు వెళ్ళే వారు కోసిన పండ్ల ను టిఫిన్ బాక్స్ లో తీసుకెళ్తుంటారు. బాక్సులలో తీసుకెళ్ళడానికి ముందే కోసి ఉంచుతారు. కాబట్టి వీటిని తినడం వల్ల పోషకాలు మొత్తం నశిస్తాయి. ఇక ఈ పండ్లు తిన్నా కూడా ఇలాంటి ప్రయోజనాలను మీరు పొందలేదు. అనుకున్న సమయంలో మాత్రమే పండ్లను కోసి తినాలి.కాకపోతే మామిడి, అరటి, బొప్పాయి వంటి కొన్ని పనులు ఉంటాయి. వీటిని తొక్క తీసిన తర్వాత మాత్రమే తినాలి. అలాగే ఆపిల్ , జామ వంటి పండ్లను అలాగే తినవచ్చును. ఇక పాలు, కాఫీ, టీ వంటి వాటితో పుల్లటి పండ్లను కలిపి తినకూడదు. ఇలా తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు కూడా అధికమవుతాయి.