Hair Tips : జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట ఈ చిట్కాలు తప్పనిసరి..!!

Hair Tips : సాధారణంగా జుట్టు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందులో భాగంగానే జుట్టుకు కావలసిన చర్యలు మనం చేపట్టాల్సి ఉంటుంది. అందుకే జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా రాత్రి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అయితే రాత్రి సమయంలో జుట్టుకు ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

మాయిశ్చరైజ్ : జుట్టుకు మాయిశ్చరైజర్ గా చేయడానికి వ్రాయడం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది మంచి ఫలితాలను అందిస్తుంది . ముఖ్యంగా సీరం లను అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతోపాటు చాలా మృదువుగా, మెత్తగా ఉంటుంది. సీరం ను అప్లై చేసిన తర్వాత తేలికపాటి చేతులతో మసాజ్ చేస్తే చాలా మంచిది.

సాయంత్రం తలస్నానం చేయడం : సాయంత్రం తలస్నానం చేయడం వల్ల మనసుకు రిలాక్స్ గా ఉంటుంది. తలస్నానం చేసిన తర్వాత కండిషనర్ వాడడం చాలా అవసరం. ఇకపోతే ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి పోషణ కూడా లభిస్తుంది.

These tips are essential for healthy hair at night 
These tips are essential for healthy hair at night

జుట్టును ఆరనివ్వాలి : సాయంత్రం తల స్నానం చేసినప్పుడు అలాగే నిద్రించకుండా పూర్తిగా జుట్టును ఆరబెట్టాలి. తడి జుట్టు తో నిద్రించడం వల్ల జుట్టు దెబ్బతినడం , రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

సిల్క్ పిల్లో : మీరు నిద్రించేటప్పుడు సిల్క్ తల దిండు ను మాత్రమే ఉపయోగించాలి. ఇక చర్మం మాదిరే జుట్టుకి కూడా అత్యుత్తమ సంరక్షణ అనేది చాలా అవసరం. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే సిల్కు పిల్లో ను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకి రాపిడి ఉండదు. అంతే కాదు సిల్క్ పిల్లో ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

ముడి వేయకుండా నిద్రపోకూడదు : రాత్రి నిద్రించేటప్పుడు జుట్టు విరబోసుకుని నిద్రించకూడదు. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యానికి హాని కలుగుతుంది అలాగే ఎంత ఫ్రీగా ఉంటే అంత రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇలాంటి జాగ్రత్తలు ప్రతి ఒక్కరికి తెలియాలి అంటే ఈ ఆర్టికల్ ను వాట్సాప్ ద్వారా షేర్ చేయండి.