Xe Omicron : భయపెడుతున్న కరోనా కొత్త వైరస్..Xe Omicron లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

Xe Omicron : కరోనా మహమ్మారి గత 2 సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త గా రూపాంతరం చెందుతూ ప్రజలపై మళ్ళీ దాడి చేస్తోంది. ఇకపోతే మొన్నటివరకూ ఒమిక్రాన్ వేరియంట్ ఎన్నో రూపాంతరాలు చెంది.. ప్రజలను ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సరికొత్తగా రెండు రకాల వేరియంట్ కాంబినేషన్తో XE ఒమిక్రాన్ అనే పేరుతో ఈ కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఈ కొత్త వేరియంట్ ను గుర్తించడం జరిగింది. ఇకపోతే ఈ వైరస్ వ్యాప్తి మూడో కరోనా వేవ్ కంటే పది రెట్లు అధికంగా ఉంటుంది అని హెచ్చరించింది. ఇక ఈ కొత్త వైరస్ కి సంబంధించి ఇప్పటికే ఆరువందలకు పైగా కేసులు నమోదైనట్లు డబ్ల్యు.

హెచ్.ఓ సంస్థ తెలిపింది.ఇకపోతే కొత్త వేరియంట్ యూకే లో జనవరి 19వ తేదీన మొదటిసారి బయటపడింది. ఈ వైరస్ కు సంబంధించిన లక్షణాలు ఎలా వుంటాయో వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మూడు హైబ్రిడ్ కోవిడ్ వేరియంట్ లు XD,XF,XE వ్యాప్తి చెందుతున్నాయని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కరోనా వ్యాక్సిన్ రెండు టీకాలు తీసుకున్న వారిని బట్టి అలాగే వారిలో ఉన్న రోగనిరోధకశక్తిని ఆధారంగా తీసుకొని ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా వైరస్ యొక్క లక్షణాలు బయటపడే అవకాశం ఉందని వైద్యులు సూచించారు.

Frightening corona new virus  What are the symptoms of Xe Omicron
Frightening corona new virus  What are the symptoms of Xe Omicron

ఇవే లక్షణాలు ఉండాలన్న గ్యారెంటీ ఏమీ లేదు అని.. ప్రధానంగా జ్వరం, గొంతునొప్పి, గొంతులో మంట , దగ్గు, జలుబు, చర్మం రంగు మారడం, జీర్ణకోశ సమస్యలు , చర్మం దురద వంటి లక్షణాలు అధికంగా ఉంటాయని వైద్యులు గుర్తించారు. అలాగే ఈ వైరస్ తీవ్రత పెరిగితే వారిలో గుండె జబ్బులు, తీవ్ర అనారోగ్యం , గుండె దడ వంటి అనేక అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గిపోయాయని అందరూ ఆనందం వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు మరో సరికొత్త ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మాస్క్ ధరించి తప్పనిసరిగా ధరించాలని, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసి అందరికి ఉపయోగపడగలరు.