Noni Fruit : తొగరు పండ్లు ఎప్పుడైనా తిన్నారా.. ఈ జ్యూస్ తాగితే.!?

Noni Fruit: తొగరు పండ్లు గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.. ఈ చెట్టు కు సంబంధించిన ఆకులు, కాయలు, పండ్లు, బెరడు అన్ని ఔషధాల గని.. తొగరు ఫలం ను నొని ఫ్రూట్ అని కూడా పిలుస్తారు.. ఈ పండు 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేస్తుంది 150కిపైగా పోషకాలు ఈ ఫ్రూట్ లో ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.. ఈ ఫ్రూట్ జ్యూస్ తాగితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే ప్రతి ఒక్కరూ కచ్చితంగా తాగుతారు..!నోని ఫ్రూట్ లో కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థాలు, విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం తో పాటు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి.

ఈ పండ్ల రసాన్ని తాగితే రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూస్తుంది. తొగరు ఫ్రూట్ జ్యూస్ లో యాంటీ ఒబేసిటీ గుణాలు ఉన్నాయి. అందువలన ఈ జ్యూస్ తాగితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. శరీర బరువును తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి రాకుండా అడ్డుకుంటాయి. తొగరు పండ్ల జ్యూస్ తాగితే ప్రొటెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Health Tips On Noni Fruit
Health Tips On Noni Fruit

నోనీ ఫ్రూట్ జ్యూస్ తాగితే మగవారిలో స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది. మహిళలలో పీరియడ్స్ సమస్యను అధిగమించడానికి పనిచేస్తుంది. సంతానం కావాలనుకునే వారికి ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. పురుషుల్లో నపుంసకత్వం, మహిళల్లో వంధ్యత్వం సమస్యను అధిగమించవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న ఈ పండు రసాన్ని కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, పాలించే తల్లులు తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి.