Nara Disti : నరదిష్టి పోవాలంటే ఎలాంటి దిష్టి బొమ్మలు తప్పనిసరి..?

Nara Disti : ఎవరైనా సరే కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు.. గ్రామాల్లో కానీ పట్టణాలలో కానీ వారి ఇంటి ముందు దిష్టిబొమ్మలను ఉంచడం గమనిస్తూనే వుంటాము. అయితే వీటిని పెట్టుకోవడం వల్ల మన ఇంటికి ఎలాంటి దిష్టి తగలదు అనేది నమ్మకం. కానీ కొంతమంది వీధిపోటు లకు ఇతరత్రా వాటికి కూడా దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు.. దిష్టి అంటే సైంటిఫిక్ గా ఏదైనా నిరూపణ ఉందా అని చూసుకుంటే సైన్స్ ప్రకారం ఖచ్చితంగా దానికి స్పెషల్ వర్డ్స్ కూడా ఉన్నాయి. నిజానికి మనం ఏదైనా ఫంక్షన్ ఉంటే బాగా అందంగా రెడీ అయి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది మనల్ని చూస్తారు. అక్కడ మీరు చాలా ఎట్రాక్టివ్ గా ఉన్నప్పుడు అందరు మిమ్మల్ని చూసిన సమయంలో.. మళ్లీ మీరు ఇంటికి వచ్చాక కాస్త అన్ ఈజీ గా ఫీలవుతారు.

అలాంటప్పుడు మీకు తలనొప్పి , ఒళ్లు నొప్పులు వంటివి వస్తాయి . ఉదాహరణకు మనకు తెలియని ఒక వ్యక్తి తదేకంగా చూస్తున్నాడు అంటే మనకు ఎలా ఉంటుంది.. చాలా అన్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి ఆరా అనేది ఒకటుంటుంది. ఇతరులు చూసినప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది. టెస్ట్ చేసి టెస్ట్ ట్యూబ్ లో చూపించలేము. అందుకే మన ఇంటిలో ఉన్న వస్తువులను బట్టి ఎంతమంది చూసారు అనే దానిలో దిష్టి తగిలింది అనేది క్రియేట్ అవుతుంది. చాలామంది తమ ఇంటిముందు పెట్టె దిష్టిబొమ్మలు నిజమైన దిష్టిబొమ్మలు కాదు.. భయంకరంగా రూపం అంటే అది దిష్టిబొమ్మ అయిపోదు. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో కూడా శ్రీముఖం పెట్టేవారు.

easy remedies prevent nara dishti 
easy remedies prevent nara dishti

ఈ ముఖం చూడటానికి భయంకరంగా ఉండడంతోపాటు 2 కోరమీసాలు, నాలుకపై తేలు, నుదిటిపై నెలవంక ఉంటుంది. ఎందుకు పెడతారు అంటే ఈ దిష్టిబొమ్మ చూడగానే మన మైండ్సెట్ ఆ బొమ్మ పై ఉన్న గుర్తుల పైకి వెళ్తుంది . దీని ద్వారా మన దృష్టి అంతా ఏదైనా ఉంటే ముందుగా ఆ బొమ్మ పైకి వెళుతుంది తప్ప. ఆ ఇంటి పైకి వెళ్ళదు. కాబట్టి ఇంట్లో శ్రీ ముఖం ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇంటికి దిష్టి తగలదు అని గుర్తుంచుకోవాలి. ఇకపోతే మీరు కూడా మీ ఇంటికి దిష్టి బొమ్మ పెట్టినట్లయితే ఈ ఆర్టికల్ ను చూసి సరి చేసుకో గలరు.