Shivalayam Temple : శివాలయంలో నంది కి ఎందుకంత ప్రత్యేకత..?

Shivalayam Temple : ఎక్కడ చూసినా హిందూ సాంప్రదాయం ప్రకారం శివాలయం కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అంతే కాదు శివాలయంలో శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. అంతే కాదు ఎంతో మంది భక్తులు.. తమ కోరికలను కోరుకోవడానికి శివాలయాలకు వెళుతూ ఉంటారు. ఇకపోతే ఏ శివాలయాన్ని దర్శించుకొన్నా సరే ముందుగా అక్కడున్న నందిని దర్శించుకోవాలి. ఆ తర్వాత శివుడిని దర్శించుకోవాలి అని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం శివుడికి ఎదురుగా నంది విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆనవాయితీ. అయితే ముందుగా నందిని మాత్రమే ఎందుకు దర్శించుకోవాలి.. శివలింగం ముందు వుండే నందికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు .. అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.

అయితే చాలామంది శివుడు ప్రథమగణాలలో నందీశ్వరుడు మొదటి వాడు. కాబట్టి మొదటి ప్రాధాన్యత నందికి ఇస్తారు అని చెబుతూ ఉంటారు. కానీ పురాణాలు ఏమి చెబుతున్నాయి అనే విషయానికి వస్తే.. పూర్వకాలంలో శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. ఇక ఎంత జ్ఞానాన్ని సాధించినా.. ఎంతటి గౌరవాన్ని సంపాదించినా కూడా అతడికి పిల్లలు లేరనే లోటు మాత్రం ఉండిపోయింది. తనకు సంతానం కలగాలి అని శిలాదుడు ఆ పరమేశ్వరునికి ఘోర తపస్సు చేశాడు. ఈ క్రమంలోనే ఆ పరమేశ్వరుడు శిలాదుడి ముందు ప్రత్యక్షమై.. అతనితో నీకు సంతానం కలుగుతుంది అని వరం ప్రసాదిస్తాడు. ఒకరోజు శిలాదుడు యజ్ఞం నిర్వహిస్తున్న సమయంలో యజ్ఞం నుంచి ఒక బాలుడు ఉద్భవించడం జరుగుతుంది. ఆ బాలుడికి నంది అనే పేరు కూడా పెడతారు.

Why is Nandi so special in Shivalayam Temple
Why is Nandi so special in Shivalayam Temple

శిలాదుడు ఎంతో ఘోరమైన తపస్సు తర్వాత పుట్టిన నందిని ఎంతో అపురూపంగా, అల్లారుముద్దుగా చూసుకునేవారు పేరుకు తగ్గట్టుగానే నంది కూడా అనేక విద్యలను నేర్చుకొని, ఎంతో తెలివితేటలతో మెప్పు పొందాడు. అయితే ఒకరోజు ఆశ్రమానికి మిత్రా వరణులు అనే దేవతలు రావడం జరిగింది. ఎంతో అల్లారు ముద్దుగా ఉన్న నందిని చూసి మురిసిపోయి.. నంది వారికి చేసిన సత్కారాలకు మైమరిచిపోయి ఆశ్రమం నుంచి వెళుతూ నందిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించబోయి ఆగిపోతారు.. అయితే ఇందుకు గల కారణం ఏమిటి అని వారిని ప్రశ్నించగా.. నందికి మరణం తొందర్లోనే సంభవించ బోతోంది అని తెలియజేసారు. శిలాదుడి ను చూసి మనసు తరుక్కుపోయిన నంది.. శివుడి అనుగ్రహం వల్ల జన్మించాను కాబట్టి నాకు మరణం లేదు అంటూ ఆ శివుడికి తపస్సు చేస్తాడు.

ఇక నంది తపస్సు వల్ల ప్రత్యక్షమైన శివుడు తనకు ఏం వరం కావాలో అది అడగక ముందే జీవితాంతం నీ పాదాల చెంత ఉండే వరాన్ని ప్రసాదించు స్వామి అని మనసులో నంది అనుకోగానే తధాస్తు అని శివుడు వరం ఇస్తాడు . ఆ రోజు నుంచి పశు రూపంలో స్వామి వారి పాదాల చెంత వారికి వాహనంగా ఉంటూ ప్రధమ గణాలలో మొదటి వాడిగా కైలాసాన్ని రక్షిస్తూ ఉంటాడు నంది.