Health Benefits : పరగడుపున వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!!

Health Benefits : అల్పాహారం అనేది మన రోజు వారీ మొత్తం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడైతే పోషకాహారం కలిగిన అల్పాహారం తీసుకుంటామో అప్పుడు రోజంతా హుషారుగా ఆరోగ్యంగా జీవిస్తారు. ఇటీవల కాలంలో చాలా మంది నటీనటులు కూడా ఫిట్నెస్ ఆరోగ్యం గురించి ఎక్కువగా తాపత్రయ పడుతున్నారు. మీరు పాటిస్తున్న నియమాలు చూస్తే మాత్రం మనం కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ఉదయం తీసుకునే కాఫీ, టీ లకు బదులు వెన్న లేదా జామ్ తో టోస్ట్ అలాగే గుడ్లు తీసుకోవాలి.ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో నానబెట్టిన బాదం గింజలు తినడం వల్ల ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

ముఖ్యంగా అల్పాహారానికి ముందు వీటిని తింటే మరింత ప్రయోజనం ఉంటుంది. పౌష్టికాహారం కలిగిన బాదం పప్పు తినడం వల్ల ఎన్నో వ్యాధులు దూరమవుతాయి.బొప్పాయి లో అధిక ఫైబర్ ఉండటం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. ఇక బొప్పాయి తిన్న తర్వాత అల్పాహారానికి మధ్య 45 నిమిషాలు గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.వేసవి కాలంలో విరివిగా లభించే పుచ్చకాయలను అల్పాహారానికి ముందుగా తీసుకోవాలి. పుచ్చకాయ తినడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటమే కాకుండా ఆహారం తినాలనే కోరిక కూడా తగ్గుతుంది.

There are many health benefits of eating these on the run
There are many health benefits of eating these on the run

మన ఆరోగ్యానికి మరింత ఆరోగ్యప్రయోజనాలను కలిగించే చియా విత్తనాలలో ఎన్నో పోషకాలు లభిస్తాయి. వీటిని కూడా రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాదు ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలుగుతుంది. పైగా బరువు పెరిగే అవకాశం ఉండదు.గోరువెచ్చని నీరు కూడా ఆరోగ్యానికి మంచిదే. ఉదయం లేచిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె , సగం నిమ్మకాయ రసం కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది.