Eruvaka Purnima : ఏరువాక పూర్ణిమ విశిష్టత ఏమిటి.. రైతులే ఎందుకు జరుపుకుంటారు..?

Eruvaka Purnima : వ్యవసాయం ఒక యజ్ఞం లాంటిది.. పనులు ప్రారంభించడానికి ముందు భూమి పూజ చేయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ముఖ్యంగా జేష్ట పౌర్ణమి ను ఏరువాక అని అంటారు. ఇక జేష్ట పౌర్ణమి కి ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే రైతులు ఆ రోజే వ్యవసాయ పనులను ఆరంభిస్తూ భూమి పూజ చేస్తారు. జేష్ట పూర్ణిమనే మనం ఏరువాక పౌర్ణిమ అని పిలుస్తూ ఉంటాము. పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. వ్యవసాయం మన మనుగడకు జీవనాధారం అందుకే భూమిని భూమాత గా కొలుస్తూ ఉంటాము.

దానికి సంబంధించిన ఏ పనులు ప్రారంభించాలన్నా సరే ముందుగా భూమికి పూజ చేయడం అనేది అనాదిగా వస్తోంది.ఇక అలా పొలాల్లో మోది దుక్కి దున్నడానికి ఏరువాక అంటారు ఏరు అంటే ఎద్దులను కట్టడానికి ఆరంభమని చెబుతారు. వర్ష ఋతువు ప్రారంభం కాగానే పౌర్ణిమ నాడు రైతులు ఉదయమే లేచి.. ఎడ్లను శుభ్రంగా కడిగి.. కొమ్ములకు రంగులు పూసి.. గజ్జలు కట్టి.. గంటలతో అలంకరించి.. వాటికి ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. ఇక ప్రత్యేక పూజలు నిర్వహించి. పొలాలకు వెళ్లి భూ తల్లికి పూజలు చేసి కొద్దిగా పొలం దున్ని ఆ తర్వాత ఇంటికి వచ్చి ఎద్దులకు రంగురంగుల రకరకాల బట్టలు అలంకరించి మేళతాళాలతో ఊరంతా ఊరేగిస్తారు.

eruvaka purnima farmers festival
eruvaka purnima farmers festival

పూర్ణిమ నాడు నాగలి సారించి.. పనులు ప్రారంభించడం వల్ల ఆ ఏడాది పంట బాగా పండుతుంది అని భక్తుల నమ్మకం. ఇక విష్ణు పురాణం ప్రకారం సీత యజ్ఞంగా ఏరువాక వివరించింది. సీత అంటే నాగలి అని వప్ప మంగళ దివసం, బీజ బాపన మంగళ దివసం పిలుస్తూ ఉంటారు. శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తు లాంఛనంగా ఈ ఏరువాక ని ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లు గా ఇతిహాసంలో చెప్పడం జరిగింది. శ్రీ కృష్ణ దేవరాయల కాలం నుంచి కూడా ఏరువాక సందర్భంగా రైతులు ఈ పండుగను జరుపుకుంటారు అని సమాచారం.