Fruit : ఈ పండుతో నిగనిగలాడే ముఖం మీ సొంతం..!

Fruit : కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు తమ జీవన విధానంలో మార్పులు తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే తీసుకునే ఆహారం మొదలు.. వేసుకునే దుస్తుల వరకు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ముఖ చర్మం విషయంలో మాత్రం పలు రకాల చిట్కాలను పాటిస్తూ తమదైన శైలిలో ముఖానికి రంగులు దిద్దుకోవాలని తాపత్రయపడుతుంటారు మగువలు. ముఖ్యంగా సమ్మర్ లో ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే మామిడి పండు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మామిడి పండ్లు తినడానికి రుచిని అందివ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మరెన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

ముఖ్యంగా చర్మ  సౌందర్యాన్ని పెంపొందించడానికి కూడా మామిడిపండు మొదటి పాత్ర పోషిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మామిడి పండు తో మన ముఖ సౌందర్యాన్ని మరింత పెంపొందించుకోవచ్చు అని బ్యూటీ నిపుణులు కూడా చెబుతున్నారు. మామిడి పండు తో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఎండాకాలంలో ఎక్కువగా లభించే మామిడి పండ్లలో మనకు విటమిన్ ఏ తో పాటు బీటా కెరోటిన్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించడంలో సహాయ పడతాయి. కాబట్టి మామిడి పండు తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను ముఖంపై అప్లై చేయడం వల్ల మొటిమలు, ముడతలు, మృత కణాలు కూడా దూరమవుతాయి.

అంతేకాదు నల్లటి మచ్చలు,  ఎండవేడికి వచ్చే మంగు మచ్చలు కూడా దూరం చేసుకోవచ్చు. మామిడిపండు తో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. రెండు టేబుల్ స్పూన్ల మామిడిపండు గుజ్జు తీసుకొని అందులో కొద్దిగా పెరుగు, కొద్దిగ తేనె వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని  ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు కూడా దూరమవుతాయి. అంతేకాదు చర్మం నిగారింపును కూడా సంతరించుకుంటుంది. మామిడి పండు తో చర్మ సౌందర్యం ఎలా అనే ఈ ఆర్టికల్ ను ప్రతి ఒక్కరికి వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.