vastu shastram: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే దరిద్రం చుట్టుకున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త.!!

vastu shastram:  వాస్తు శాస్త్రం అనేది దిక్కులకు సంబంధించి మాత్రమే కాదు వస్తువులకు సంబంధించి కూడా అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను అదికూడా ఇతరులు వాడిన వస్తువులను మీ వద్ద పెట్టుకుంటే కచ్చితంగా దురదృష్టం వెంటాడుతుంది. ఇక ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ఒకవేళ మీ వస్తువులు గనక ఇతరుల దగ్గర ఉన్నట్లయితే ఈ ఆర్టికల్ను వారికి వాట్సాప్ ద్వారా షేర్ చేసి మీ వస్తువులను మీరు వెనక్కి తెచ్చుకోవడం మంచిది. అంతే కాదు ఈ ఆర్టికల్ ద్వారా వారికి కూడా ఇతరుల వస్తువులను తమ దగ్గర ఉంచుకోకూడదు అన్న విషయం తెలుస్తుంది.

ఆ వస్తువులు ఏమిటి అంటే మొదటగా వస్త్రాలు.. ముఖ్యంగా స్నేహితులు లేదా అక్కచెల్లెళ్ళు ఎవరైనా ఉంటే ఒకరికి సంబంధించిన దుస్తులను మరొకరు మార్చుకుంటూ ఉంటారు. కానీ ఇలా వేసుకోవడం వల్ల ఒకరి దరిద్రం మరొకరికి వచ్చే అవకాశం ఉంటుందట. అంతేకాదు వారి శరీరంపై ఉన్న బ్యాక్టీరియా వారి దుస్తులను మీరు ధరిస్తే దుస్తుల ద్వారా మీ లోకి బ్యాక్టీరియా ప్రవేశించి.. అనారోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. కేవలం దుస్తులు మాత్రమే కాదు వారికి సంబంధించిన దువ్వెన , మేకప్ ఉత్పత్తులు లాంటివి కూడా అస్సలు ఉపయోగించకూడదు.

చేతి గడియారాలు.. ఇది కేవలం సమయాన్ని మాత్రమే కాదు జీవితంలో జరిగే మంచి , చెడులను కూడా సూచిస్తుంది.  అందుకే ఇతరులకు సంబంధించిన వాచీ లను మీరు ఎప్పుడూ కూడా ఉపయోగించవద్దు. ఒకవేళ మీ దగ్గర ఇతరుల వాచీలు కనుక ఉన్నట్లయితే వెంటనే వారికి తిరిగి ఇచ్చేయడం ఉత్తమం. ఇక మీ కెరీర్లో ఆర్థిక నష్టం ఎదురు కాకూడదు అంటే ఆఫీసులో కానీ కాలేజ్, స్కూల్ ఇలా ఎక్కడైనా సరే ఇతరులకు సంబంధించిన పుస్తకాలను స్టేషనరీ ని అసలు ఉపయోగించకూడదు.

అలాగే ఒకరు ఉపయోగించిన ఆభరణాలను ఇంకొకరు ఉపయోగించకూడదు. అఇతరులు తమ ఇంట్లో వూడ్చే పరకలను కూడా మన ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే పసుపు,  ఉప్పు వంటి వాటిని కూడా ఇతరులకు ఇవ్వడం లేదా ఇతరుల నుంచి తీసుకోవడం లాంటివి కూడా చేయకూడదు.