Lucky Bamboo : లక్కీ బ్యాంబు చెట్టు మీ ఇంట్లో అక్కడ ఉంచితే వద్దన్నా డబ్బే డబ్బు..! 

Lucky Bamboo: కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచుకుంటే కనకవర్షం కురుస్తుంది.. అటువంటి మొక్కలలో లక్కీ బ్యాంబు ట్రీ కూడా ఒకటి.. చైనీస్ వాస్తు శాస్త్రం ఫెంగ్ షుయ్ ప్రకారం.. ఈ వెదురు మొక్కలు లక్కీ ప్లాంట్ గా భావిస్తారు.. ఇది ఇండోర్ ప్లాంట్.. మన నవగ్రహాలలో బుధ గ్రహానికి చెందినది ఈ మొక్క.. అటువంటి ఈ మొక్కను ఏ దిశలో పెంచుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!
ఇంటికి తూర్పు మూలలో వెదురు మొక్క ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఈ చెట్టు ఉంచితే నరదృష్టి, చూపుడు దృష్టి, వీధి పోటు ను పోగొడుతుంది. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేసి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలిగేలా గా చేస్తుంది. ఈ మొక్క ఉన్న ఇంట్లో ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు నెలకొంటాయి. ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ మొక్కను పెంచుకోవడం వలన ధనాకర్షణ కలిగి సంపదకు కొదవ ఏర్పడదు.
వ్యాపార సంస్థలలో లక్కీ బ్యాంబు ట్రీ ఎలా పెరుగుతుందో మీ వ్యాపారం కూడా అలాగే అభివృధి చెందుతుంది. ఈ చెట్టు ఎలా పెరుగుతుందో అలాగే దినదినాభివృద్ధి చెందుతుంది. మీ వ్యాపారం జరుగుతున్న ప్రదేశంలో హలో నరదృష్టి ని తొలగించి ధనాకర్షణ జరిగి వ్యాపార అభివృద్ధి జరిగేలా చేస్తుంది. ఎరుపు రంగు బ్యడ్జ్ ఉన్న చెట్టును మాత్రమే పెంచుకోవాలి. పిల్లలు చదువుకునే టేబుల్ పైన ఈ చెట్టు ఉంచితే చదువుపై శ్రద్ధ పెరిగి చక్కగా చదువుతారు. మంచి తెలివితేటలు వస్తాయి. చదివింది బాగా గుర్తుంటుంది. చక్కటి వాక్ చాతుర్యం కూడా కలుగుతుంది.