Eyesight:  కంటి చూపు మెరుగు పడాలంటే ఇలా చేయాల్సిందే..!!

Eyesight:  ఈ మధ్య కాలంలో చాలా మంది లాప్టాప్లు, సెల్ఫోన్లు, టీవీలు వంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇక అందుకే కంటి చూపు మెరుగు పడాలంటే విటమిన్ ఎ సమృద్ధిగా లభించే ఆకుకూరలు, కాయకూరలు తినాలి అని వైద్యులు సలహా ఇస్తుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న చిట్కా పాటించినట్లయితే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. దాని పేరే పాలక్ ఖంద్వి.. దీనిని వారానికి రెండు సార్లు చేసుకొని తింటే కాల్షియం సమృద్ధిగా లభించడమే కాదు ఎముకలు కూడా బలంగా తయారవుతాయి.

పాలకూరను శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకొన్న ఒక కప్పున్నర పాలకూర , కరివేపాకు,  ఒక స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు,  ఒక కప్పు పెరుగు వేసి మెత్తటి పేస్టులాగా మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల బొంబాయిరవ్వ,  రెండు టేబుల్ స్పూన్ల మల్టీగ్రెయిన్ పిండి వేసి మరొకసారి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి  వచ్చే పిప్పిని పక్కకు పడేయాలి. ఇప్పుడు రెడీగా ఉన్న పాలక్ పేస్టు లో ఐదు ఎండు మిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా వేసి అందులో వేయాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర,  ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , అర టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలి.

ఇప్పుడు దీనిని ఒక గిన్నెలో పోసి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇక బాగా ఉడికిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రోల్స్ కింద చుట్టాలి. ఇప్పుడు మరొక  పాన్ పెట్టి కొంచెం వెన్న వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వేయించిన నువ్వులు వేసి బాగా వేగించాలి. తయారుచేసి పెట్టుకున్న రూల్స్ పైన ఈ మిశ్రమాన్ని వేయాలి . ఇలా తయారు చేసుకొని తింటే రుచిగా ఉండటమే కాదు శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి.. కంటి చూపు మెరుగుపడుతుంది.