curd: పెరుగుతో ఇలా చేశారంటే రోగాలన్నీ పరార్..!!

curd: సంవత్సరం పొడవునా వంటగదిలో లభించే చల్లటి పానీయాలలో మజ్జిగ కూడా ఒకటి. మజ్జిగ చేసే మేలు అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. ముఖ్యంగా పెరుగు వల్ల కూడా మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి.ఈ వేసవి కాలంలో వేడి నుంచి ఉపశమనం పొందాలి అంటే పెరుగును చక్కటి మజ్జిగలో వేసుకుని తాగితే ఎంతటి వేడి అయినా సరే ఇట్టే దూరమవుతుంది. ముఖ్యంగా వడదెబ్బ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే తప్పకుండా మజ్జిగను ఎక్కువగా తాగాలని వైద్యులు సైతం సలహా ఇస్తూ ఉంటారు. ఇకపోతే పెరుగును రకరకాల పదార్థాలతో తినడం వల్ల వివిధ రకాల రోగాలను కూడా దూరం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో పెరుగు ఉంటుంది కాబట్టి పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలను కూడా అందరికీ తెలియాలి అంటే వాట్స్అప్ ద్వారా ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి.


పెరుగును చక్కెరతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి . ఈ రెండింటిని కలిపి తినడం వల్ల గొంతులోని కఫం సమస్య కూడా తొలగిపోతుంది. అలాగే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇక ఉపవాసం సమయంలో చాలామంది రాక్ సాల్ట్ తో కలిపిన పెరుగును తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఎసిడిటీ సమస్య దూరమవుతుంది. కడుపులో గ్యాస్ వంటి సమస్యలు కూడా తలెత్తవు. ఇకపోతే పెరుగును జీలకర్రతో కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఇదివరకే బరువు తగ్గాలని ప్రయత్నించే వాళ్ళు పెరుగులో జీలకర్ర పొడిని వేసుకుని తింటే మంచి ఫలితాలు కలుగుతాయి.

ఇక దంతాలు , చిగుళ్ళ నొప్పితో బాధపడుతున్న వారు పెరుగులో కొద్దిగా వాము కలుపుకుని తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తో పాటు దంతాల సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే అల్సర్ సమస్య కూడా దూరం అవుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు పెరుగులో నల్లమిరియాల పొడి వేసుకొని తినడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు జుట్టు సిల్కీగా మారడం కూడా మీరు గమనించవచ్చు