Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలో తెలిస్తే షాక్..!!

Bottle Gourd Juice : మనం ఎక్కువగా ఉపయోగించే కాయగూరలలో సొరకాయ కూడా ఒకటి. ఈ కాయ రుచితో పాటు అనేక పోషకాలు సొరకాయ సొంతం . అయితే ఆరోగ్యాన్నిచ్చే ఈ సొరకాయను జ్యూస్ రూపంలో తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.సొరకాయ లో విటమిన్ బి, విటమిన్ సి తోపాటు.. సోడియం, ఐరన్, జింక్, పొటాషియం కలిగి ఉంటుంది. ఇది అధిక మొత్తంలో నీటిశాతాన్ని మరియు తక్కువ కొలెస్ట్రాల్ ను కలిగి ఉంటుంది. ప్రతిరోజు సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల అనేక అద్భుత ఫలితాలను పొందవచ్చు. సొర కాయ ముక్కల్ని గ్రైండర్లో వేసి మెత్తగా చేసుకోవాలి.. తర్వాత కాస్త ఉప్పు, జీరా పొడి, మిరియాల పొడి, పుదీనా ఆకులు వేసి బాగా మిక్సీ పట్టి పానీయాన్ని తయారు చేసుకోవాలి.

The benefits of drinking Bottle Gourd Juice
The benefits of drinking Bottle Gourd Juice

1). సొరకాయలో నీటిశాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది. అంతే కాకుండా చర్మానికి కావాల్సిన తేమను కూడా అందించి చర్మాన్ని, హెల్త్ ను బాగా ఉండేలా చూస్తుంది.

2). బరువు తగ్గాలనుకునేవారు ఈ పానీయాన్ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల తేలికగా బరువు తగ్గించుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఉండే వ్యర్థాలను బయటికి తేలికగా పంపడానికి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది.

3). డయేరియాను నివారిండానికి ఈ సొరకాయ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో నీటి శాతం, మినరల్స్ ఎక్కువ మొత్తంలో కలిగి ఉండడం వల్ల ఈ జ్యూస్ విరోచనాలను నివారించడంతో పాటు.. శరీరంలో కోల్పోయిన ఖనిజాలను భర్తీ చేస్తుంది.

4). ఈ సొరకాయ జ్యూస్ ఈ గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు జింక్ ను కూడా అందిస్తుంది. ఇది శరీరంలో ఉండే రక్తసరఫరాను క్రమబద్దీకరిస్తుంది. అంతేకాకుండా అధికరక్తపోటు సమస్య నుంచి మనిషిని బయటపడేలా చేస్తుంది.

5). కంటి చూపు మెరుగు పరిచేందుకు విటమిన్ -A ఇందులో పుష్కలంగా ఉంటుంది. అందుచేతనే కంటిచూపు సమస్యలతో బాధపడే వారు వీటిని తప్పకుండా తీసుకోవడం మంచిది.