Pradishakalam : ప్రదోషకాల సమయం లో ఏం చేయాలి..?

Pradishakalam : ముందుగా ప్రదోషకాలం అంటే ఏమిటో మనం ఇప్పుడు చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .. ప్రదోషకాలం అనేది చాలా అత్యంత పవిత్రమైనది .. ఇది కేవలం నెలకు రెండుసార్లు మాత్రమే వస్తుంది. శుక్ల పక్షం, కృష్ణ పక్షాలలో వచ్చే త్రయోదశి నాడు సూర్యాస్తమయం తర్వాత 02:24 సమయాన్ని మనం ప్రదోషకాలం అని పిలుస్తూ ఉంటాము. మరికొందరు ఏం చెబుతున్నారు అంటే సూర్యాస్తమయం తర్వాత 1: 11 నిమిషాల వ్యవధి ని ప్రదోష కాలం అని పిలుస్తారు.ప్రదోషకాలం అంటే రాత్రికి ఆరంభ సమయం గా పరిగణించవచ్చు. ఎందుకంటే సూర్యాస్తమయం అయ్యేసరికి సుమారుగా 6 గంటల సమయం మనకు గడియారంలో చూపిస్తుంది.

అలాంటప్పుడు సూర్యాస్తమయం తర్వాత మరో రెండు గంటలు అంటే సుమారుగా ప్రజలు రాత్రి పూట డిన్నర్ చేసే సమయం అన్నమాట . 8:00 గంటల సమయంలో ప్రదోషకాలం ఏర్పడుతుంది అని పండితులు చెబుతున్నారు. ఎందుకు ప్రదోష కాలానికి అంత ప్రాముఖ్యత ఉంది అనే విషయం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ముఖ్యంగా ప్రదోషకాలంలో పార్వతి , పరమేశ్వరుడు అర్థనారీశ్వర రూపంలో ఆనంద తాండవం చేస్తాడు అని పండితులు విశ్వసిస్తారు. పాప నిర్మూలన ఆ సమయంలో పరిగణించడం గమనార్హం. ఇక ఎవరైనా సరే పాప నిర్మూలన చేసుకోవాలని భావించే వారు ఈ సమయాన్ని గుర్తించుకొని తగిన పరిహారం చేసుకుంటే పాపపరిహారం పోతుంది

What to do in case of pradishakalam
What to do in case of pradishakalam

అని పండితులు చెబుతున్నారు. ఇకపోతే ప్రదోష కాలం సమయంలో ఇష్టదైవానికి సంబంధించిన స్తోత్రాలు పఠించడం గానీ, భజనలు గానీ చేస్తే మంచిదని పెద్దల మాట. ప్రదోషకాలంలో శివలింగాన్ని ఆవుపాలతో అభిషేకిస్తే దీర్ఘాయుష్షు కలుగుతుందనీ, నెయ్యితో అభిషేకిస్తే మోక్షం లభిస్తుందనీ, గంధంతో అభిషేకం చేస్తే లక్ష్మీకటాక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నవారు పండితులను సందర్శించి ప్రదోషకాలంలో మీ జాతకరీత్యా ఎలాంటి పరిహారాలు చేస్తే శుభం కలుగుతుందో తెలుసుకొని చేయడం వల్ల ఆర్థిక ఆయురారోగ్యాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.