Health Benefits : రోజు ఆ ఆకులు 2 నమిలితే ఆ సమస్యలు దూరం..!

Health Benefits : ప్రకృతి ఒడిలో ఎన్నో ఔషధాలు మొక్కలు వాటిలో తిప్పతీగ కూడా ఒకటి..! అన్ని సీజన్స్ లో ఈ చెట్టు పచ్చగా ఎదుగుతునే ఉంటుంది..! తిప్పతీగ లో ఉన్న ఔషధ గుణాలు మరే తీగజాతి మొక్కకు సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.. ప్రతిరోజు రెండు తిప్పతీగ ఆకులను నమిలితే ఎటువంటి ఆయుర్వేద ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!తిప్పతీగ ఆకులలో ఆంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరస్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులను ప్రతిరోజు తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

ఈ ఆకులను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్లాసు పాలలో కలుపుకుని అందులో కొద్దిగా అల్లం రసం కలిపి రెండు పూటలా తాగితే కీళ్ల నొప్పులు ఫటాఫట్. తిప్పతీగ ఆకుల పొడి లో కొద్దిగా బెల్లం కలిపి తీసుకుంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలను తగ్గిస్తుంది.మధుమేహంతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ రెండు ఆకులను నమిలి తింటే డయాబెటిస్ త్వరగా తగ్గుతుంది.

health benefits of Tippa Teega
health benefits of Tippa Teega

టెన్షన్, ఒత్తిడి, మానసిక ఆందోళనతో బాధపడుతున్న వారు ఈ తిప్పతీగ పొడి ప్రతిరోజు తీసుకుంటే మెరుగైన ఫలితాలు కలుగుతాయి. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. జ్వరం, ఆస్తమా, హెపటైటిస్ సైన్ ఫ్లూ, మలేరియా, డెంగ్యూ, గుండె సంబంధిత రోగాలను నయం చేయడంలో తిప్పతీగ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖం పై మొటిమలు మచ్చలు వృద్ధాప్య ఛాయలు తొలగించే శక్తి ఈ ఆకులకు ఉంది. ఈ ఆకులను ముద్దగా నూరి ముఖానికి అప్లై చేసుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.