Diabetics : డయాబెటిస్ రోగులకు నల్ల జీలకర్ర ఉపయోగపడుతుందా..?

Diabetics : సాధారణంగా భారతీయులు తమ వంటింటిలో జీలకర్రను ఎక్కువగా ఉపయోగిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే కొన్ని దశాబ్దాల నుంచి వంట ఇంటిలో వంట దినుసుగా జీలకర్రను ఉపయోగిస్తున్నారు. జీలకర్ర లో రెండు రకాలు ఉంటాయి .. ఒకటి సాధారణ జీలకర్ర అయితే మరొకటి నల్ల జీలకర్ర. ఇక సాధారణ జీలకర్రతో పోల్చుకుంటే నల్లజీలకర్ర లోనే అధికంగా పోషకాలు ఉంటాయి. ఇక నల్లజీలకర్రను కొద్దిగా తీసుకొని మరిగే నీటిలో వేసి కషాయంలా తయారుచేసి తాగితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు నల్ల జీలకర్ర చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

నల్ల జీలకర్ర లో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఫ్రీరాడికల్స్ ను నాశనం చేసే గుణాలను కలిగి ఉండడం వల్ల శరీరంలోకి ప్రవేశించే వైరస్, బాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ను దూరం చేయడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. అంతే కాదు క్యాన్సర్లు రాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం అంటూ వచ్చే జలుబు ,దగ్గు, జ్వరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.ప్రతిరోజు నల్ల జీలకర్ర తో కషాయం చేసుకుని తాగితే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. బరువు తగ్గాలనుకొనే వారికి ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇక హైబీపీ అదుపులో ఉండి.. గుండెపోటు వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

Can black cumin be useful for diabetics
Can black cumin be useful for diabetics

తరచు తాగుతూ ఉండడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇక నల్ల జీలకర్ర తో కషాయం చేసుకుని తాగితే శరీరంలో ఉండే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. అంతేకాదు కీళ్ళనొప్పులు.. కండరాల నొప్పులు ఉన్నవారికి కూడా ఇది ఎంతగానో మేలు చేస్తుంది.పేగు అల్సర్లు తోపాటు జీర్ణాశయ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. అంతే కాదు కడుపులో నొప్పి వెంటనే తగ్గిపోతుంది. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలతో పాటు లివర్ సమస్యలు ఉన్న వారు కూడా ఈ కషాయం తాగితే త్వరగా కోలుకుంటారు. అంతేకాదు లివర్ లో పేరుకుపోయిన వ్యర్థాలు కూడా బయటకు వస్తాయి.