Health Benefits : చద్దన్నం తో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు..!!

Health Benefits : ఇటీవల కాలంలో చాలా మంది ఉదయం వండినది మధ్యాహ్నం తినడానికి అలాగే మధ్యాహ్నం వండినది సాయంత్రం తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతే కాదు ఎప్పటికప్పుడు వేడివేడిగా ఇన్స్టెంట్గా తయారు చేసుకొని తినాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలం వాళ్లతో పోల్చుకుంటే పురాతన కాలంలో చాలామంది చద్దన్నం తినే అలవాటు ఎక్కువగా ఉండేది . ముఖ్యంగా రకరకాల పద్ధతుల్లో ఈ చద్దన్నం తయారు చేసుకుని తినే వారు. అంతేకాదు చద్దన్నం ఏ పద్ధతిలో తయారుచేసుకొని తిన్నా సరే మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు .. ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు.అంతేకాదు ఇటీవల కాలంలో మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో చద్దన్నం అనగానే పేదల ఆహారం అనేది ఒక అపోహ ప్రబలింది.

ఇకపోతే సేంద్రియ వ్యవసాయం , ప్రకృతి వైద్యం వంటి పురాతన పద్ధతులు మళ్లీ పుంజుకుంటున్న నేపథ్యంలో చద్దన్నం కి కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కొన్ని ఫైవ్ స్టార్ హోటల్ కూడా చద్దన్నం అని ప్రత్యేకంగా వడ్డిస్తూ ఉండడం గమనార్హం. ఒడిశాలోని చద్దన్నం ని పొఖాళో అంటారు. ఒడిస్సా జనాలు ఏకంగా తయారుచేసుకొని దీనికి .. ప్రత్యేకంగా ఒక రోజున కేటాయించడం జరిగింది.గత ఏడు సంవత్సరాల నుంచి మార్చి 20వ తేదీ ని పొఖాళో దిబస్ అంటే చద్దన్నం దినోత్సవంగా పాటిస్తున్నారు. మార్చి 20వ తేదీ నుంచి వేసవి కాలం ముగిసేవరకు ఈ రాష్ట్ర ప్రజలు చద్దన్నం తింటారు.

Lots of health benefits with chaddannam
Lots of health benefits with chaddannam

అంతేకాదు పూరీలో జగన్నాథుడికి ప్రతిరోజు నైవేద్యంగా పెట్టే ఛప్పన్న భోగాలలో 56 పదార్థాలలో ఈ పొఖాళో కూడా ఒకటి. ఇక కేవలం ఒడిస్సా లోనే కాదు ఉత్తరాంధ్ర జిల్లాలలో కూడా చద్దన్నాన్ని పకాలన్నం అని పిలుస్తారు. ఇక రాత్రి వండిన అన్నం లో కొన్ని నీళ్లు పోసి సుమారుగా 12 గంటల సేపు నానబెట్టి..మరుసటి రోజు ఉదయం ఆ పులిసిన నీటికి ఒక ప్రత్యేకమైన రుచిని తీసుకొస్తుంది. ఇలా బాగా పులిసిన నీటిని తరవాణి అంటారు.. పెరుగు కలుపుకుని తింటారు .. మరికొంతమంది ఉప్పు వేసుకొని, ఉల్లిపాయ, మిరపకాయలను కూడా తింటారు.. ఎవరి అనుకూలం కాబట్టి వారు తినడం వల్ల పెద్ద పేగుల్లో ఉండే బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అంతే కాదు శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరిగి కడుపు చల్లగా ఉండడమే కాకుండా వేసవి కాలంలో వచ్చే ఎండ తాకిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.