Beauty Tips : ఇకపోతే ఎండాకాలం మొదలైంది.. అలా ఎండాకాలం మొదలు అయిందో లేదో ఇలా సూర్యుడి ప్రభావం ప్రజలపై ఎక్కువగా పడుతోందని చెప్పవచ్చు. ఇంకా మే నెల రాకనే సూర్యుడు తన ప్రభావాన్ని పూర్తిగా చూపిస్తూ ఉండటంతో ప్రజలు ఎండ తాకిడి తట్టుకోలేక ఇబ్బంది పడి పోతున్నారు. ఈ ఎండల వల్ల ఆరోగ్యానికే కాదు చర్మానికి , జుట్టుకు కూడా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో చర్మం పై దుమ్ము, ధూళి, చెమట పేరుకు పోయి ముఖం నల్లగా నిస్తేజంగా కనబడుతోంది.. ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే అమ్మాయిలు , అబ్బాయిల కోసం ఒక మంచి ఫేస్ ప్యాక్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది.
కేవలం ఇంట్లో లభించే ఇంటి వస్తువులతోనే మీరు ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు.. ఒక చిన్న కప్పు తీసుకొని అందులో ఒక చెంచా శెనగపిండి.. అరచెంచా కస్తూరి పసుపు.. ఒక చెంచా పెరుగు లేదా పాలమీగడ తీసుకొని మూడింటిని బాగా మిక్స్ చేయాలి. ఇక దీనిని ముఖానికి అప్లై చేసే ముందు ఆవిరి పట్టడం లేదా ఐస్ క్యూబ్ తో మర్దనా చేయడం లాంటివి చేయాలి. ఇప్పుడు ముఖం మీద ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకుని పది నిమిషాల తర్వాత నీటిని చల్లుతూ నెమ్మదిగా మర్దనా చేస్తూ ముఖాన్ని వాష్ చేయాలి.
ఇలా వారానికి మూడు సార్లు కనుక తప్పకుండా ఈ చిట్కా పాటిస్తే మీ చర్మం మీద అదనంగా ఉత్పత్తి అయ్యే నూనె కూడా తగ్గుతుంది.అంతేకాదు చెమట ,దుమ్ము , ధూళి వంటి వాటి నుండి చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది. ట్యాన్ వల్ల వచ్చే నల్లటి చర్మాన్ని ఈ ఫేస్ ప్యాక్ దూరం చేస్తుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాగే చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు కూడా తొలగిపోతాయి. సెనగపిండి చర్మ కాంతిని మెరుగు పరిస్తే .. పసుపు చర్మం పైన ఉండే ముడతలు, నల్లటి మచ్చలు, మొటిమలను దూరం చేస్తుంది. అంతేకాదు రూపాయి ఖర్చు లేకుండా మీరు చిటికెలో మీ ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.