Railway jobs : స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలు.. కేవలం చదివితే చాలు..!!

Railway jobs : రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా ఎన్నో ఉద్యోగాలు భర్తీ చేస్తూ నిరుద్యోగులు ఉండకుండా చేస్తోంది ప్రభుత్వం.. ఇక ఇప్పుడు కూడా ప్రభుత్వం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ వస్తోంది.. ఇప్పుడు తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ గోరక్ పూర్ కు చెందిన నార్త్ ఈస్ట్ ఇండియన్ రైల్వేలో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ స్పోర్ట్స్ కోటాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయనున్నారు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.

Railway jobs in sports quota
Railway jobs in sports quota

1).మొత్తం ఖాళీల సంఖ్య..21.. ఖాళీల భర్తీ చేయాలి. ఇందులో ముఖ్యంగా క్రికెట్, హాకీ, వాలీబాల్, రెస్లింగ్, బాస్కెట్ బాల్ తదితర విభాగాల లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.

2). అర్హతలు : పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు..10+2 /తత్సమాన ఉత్తీర్ణత అయి ఉండాలి.

3). అభ్యర్థుల వయస్సు : అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

4). అప్లై చేయు విధానం : ఆసక్తికరమైన అభ్యర్థులు అర్హత కలిగిన అభ్యర్థులు కేవలం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు అప్లై చేసుకోవాలి.

5). అభ్యర్థుల ఎంపిక : అభ్యర్థులను స్పోర్ట్స్, అకాడమీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఉంటుంది.

6). జీతభత్యాలు : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,200 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు.

7). దరఖాస్తుకు చివరి తేదీ : 25-4-2022 న దరఖాస్తు అప్లై చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది.

అభ్యర్థులు ఏదైనా పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను https://www.nergkp.org/index_ner_rrc_sq_2021_2020.php సంప్రదించండి. అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు ఖచ్చితంగా వారి యొక్క స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ ను దగ్గర ఉంచుకోవాలి.