Tippa Teega : ఈ తీగ మొక్క చాలా పవర్ ఫుల్.. రోడ్డు మీద కనిపిస్తే వెంటనే ఇంటికి తీసుకు వెళ్ళిపొండి..

Tippa Teega  ఆయుర్వేద వైద్యంలో తిప్పతీగకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది తమలపాకు ఆకుల గానే ఉంటుంది కానీ.. ఈ తీగ ఆకులు మాత్రం చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ ఆకులకు వైద్య గుణాలు ఉన్నాయని ఎక్కువ మందికి తెలియదు.. తిప్పతీగ అనేది ఒక యాంటీ ఏజింగ్ హెర్బ్.. ప్రతిరోజు రెండు తిప్పతీగ ఆకులను తింటే ఎలాంటి ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ పాటిస్తారు.

Surprising health benefits of Tippa teega
Surprising health benefits of Tippa teega

తిప్పతీగను ఇంగ్లీషులో గిలోయ్ అని సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. ఇది అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండి చెట్లపైకి ఎగబాకుతుంది. రోజు రెండు ఆకులను నమ్మితే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తిప్పతీగలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. తిప్పతీగ ఆకుల చూడడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జ్వరాలు, వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీబయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ గుణాలు శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నశింపచేస్తాయి. తిప్పతీగ ఆకుల పొడిని బెల్లం లో కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవచ్చు. మానసిక ఆందోళన, ఒత్తిడి సమస్యలతో సతమవుతమవుతున్న వారు తిప్ప తీగ చూర్ణాన్ని ప్రతిరోజు తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.

గోరువెచ్చని పాలల్లో కొద్దిగా తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి రెండు పూటలా తీసుకుంటే కీళ్ల నొప్పులు మాయం. జలుబు, దగ్గు, ట్రాన్సిల్స్ తో పాటు అనేక రకాల శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు తిప్పతీగ చూర్ణాన్ని వాడితే ఫలితం ఉంటుంది. హైపోటైటిస్, ఆస్తమా, జ్వరం వంటి సమస్యలను కూడా ఇది నయం చేస్తుంది. తిప్పతీగ పొడిని పాలలో వేసుకొని కలుపుకొని తాగితే కీళ్ల నుంచి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ముఖంపై మొటిమలు మచ్చలు పోగొట్టడమే కాకుండా వృద్ధాప్య ఛాయలు దరిచేరనివ్వకుండా చేస్తుంది. ఈ ఆకులలో యాంటీ ఏజనింగ్ లక్షణాలు ఉన్నాయి . ఇవి ముఖంపై ముడతలు పడకుండా చేస్తుంది. నిత్య యవ్వనం గా కనిపించేలా చేస్తాయి.