Health Benefits : వేడివేడిగా ఈ టీ తాగితే.. ఆరోగ్యానికి బోనస్..!

Health Benefits : వేడి వేడిగా చాయ్ పడిందే రోజు మొదలవదు కొందరికి.. తలనొప్పి , ఆఫీస్ లో టెన్షన్, చిరాకు, అతిథులు ఇంటికి వచ్చిన ఇలా కారణం ఏదైనా వేడివేడిగా ఉండాల్సిందే.. టీ లో బోలెడు రకాలు ఉన్నాయి.. ఈరోజు చాలా మసాలా టీ గురించి తెలుసుకుందాం.. ఈ టీ ఎలా తయారు చేయాలి.. ఈ టీ తాగితే ఆరోగ్యానికి కలిగే బోనస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..!

లవంగాలు ఐదు, యాలకులు మూడు, దాల్చిన చెక్క ఒక స్పూన్, జాజికాయ చిన్న ముక్క, అల్లం చిన్న ముక్క, మిరియాలు 5.ముందుగా వీటన్నింటినీ కలిపి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టీ డికాషన్ పెట్టుకొని మరి గాక అందులో పాలు పోసి మరిగించాలి. బాగా మరిగిన తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడిని వేసుకుని మరో రెండు నిమిషాల పాటు మరిగించాలి. కప్పులోకి టి సర్వ్ చేసుకుంటే.. గరం గరం మసాలా టీ తాగడానికి రెడీ..సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Surprising Health Benefits Of masala Tea
Surprising Health Benefits Of masala Tea

అటువంటి మసాలా టీ తాగితే టెన్షన్ మొత్తం ఉఫ్.. మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. అలసటను పోగొట్టి ఉత్తేజాన్నిస్తాయి. జలుబు, దగ్గు, ఊపిరి ఆడకపోతుంటే ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది. శరీరం మెటబాలిజం రేటును పెంపొందిస్తుంది. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవాలంటే ప్రతిరోజు ఈ టి తాగాల్సిందే. రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. బ్లడ్ ప్రెజర్ ను నియంత్రించి ఉంచడమే కాకుండా డయాబెటిక్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.