శని పట్టి పీడిస్తోందా.. తొలగిపోయి కోటీశ్వరులు కావాలంటే ఇలా చేయండి..!!

సోమవారం శివునికి ప్రత్యేక రోజుగా పరిగణించినట్లే.. శనివారం రోజున శనీశ్వరుడికి ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు.. శని దేవుడి అనుగ్రహం మనమీద ఉన్నట్లయితే అన్ని మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే మరికొంతమంది శనీశ్వరుడు పేరు పలికినా కూడా ఆయన శాపం మనకు తగులుతుంది అని భయపడుతూ ఉంటారు . అంతే కాదు శని ప్రభావం మనపై పడింది అంటే చాలు కొన్ని సంవత్సరాల పాటు ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మానసిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో భార్య భర్తల మధ్య గొడవలు ఇలా ఎన్నో చోటు చేసుకుంటాయి. శనీశ్వరుడిని పూజించాలంటే కూడా చాలామంది ఆలోచిస్తుంటారు.

అయితే గ్రహ , రాశి, జాతక రీత్యా ప్రతి రెండున్నర సంవత్సరానికి శనిగ్రహం రాశి ని మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా శని బాధలు ఎదుర్కోక తప్పదు. మరీ ముఖ్యంగా కొంత మందిని శని దేవుడు పట్టి పీడిస్తుంటాడు. అలాంటి వాళ్లు జీవితంలో ఏం చేసినా ఎదుగుదల లేక తీవ్ర మానసిక సంక్షోభంలో కూరుకుపోతుంటారు. మరి శనిదేవుడిని నుంచి విముక్తి పొందాలి అంటే శనీశ్వరుడిని ఎలా పూజించాలి అనే విషయాలను కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ అనవసరంగా భయపడకుండా అపోహలను దూరం చేసుకుంటే శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు. ఎందుకంటే శనీశ్వరుడు న్యాయ దేవుడు మాత్రమే కాదు మన కర్మాను సారంగా ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు.

Saturn is tormenting Get rid of it and do this if you want billionaires
Shani Dev is tormenting Get rid of it and do this if you want billionaires

ఇక మీరు చేయవలసిందల్లా శనీశ్వరుడిని పూజించే సమయంలో స్వామివారిని నేరుగా చూస్తూ పూజ చేయకూడదు. అలాగే శనీశ్వరుడిని ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు. స్వామి వారి కళ్ళలోకి కళ్ళు పెట్టి కూడా చూడకూడదు. శనీశ్వరుడు ని పూజించేటప్పుడు తల కూడా వంచకూడదు. శనిదేవుడిని కేవలం శనీశ్వరుడు అని మాత్రమే పిలవాలి . లేకపోతే మరింత దరిద్రం పట్టుకుంటుంది అని.. శనీశ్వర అని పలికిన ప్రతిసారి ఈశ్వర అనే పదం కూడా ఉండాలి. ఈశ్వర అనే శబ్ధం ఐశ్వర్యానికి పుట్టినిల్లు. కాబట్టి శనీశ్వరుడు అని పిలవాలి. ఇక ప్రతి శనివారం శనీశ్వర ఆలయానికి వెళ్లి ఆయనకు ఎంతో ఇష్టమైన నీలి రంగు పుష్పాలను సమర్పించి ..చలివిడి నైవేద్యంగా సమర్పించాలి. ఇక నల్లటి వస్త్రాలు ధరించి నువ్వుల నూనెతో పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలను ఆర్థికాభివృద్ధిని పొందవచ్చు.