Health Benefits : వేసవి కాలం లో మామిడి పండ్లే కాదు.. మామిడి చెట్టు నుంచి వచ్చే పూత కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. అయితే తియ్యగా ఉండే మామిడిపండును తింటున్నాము కానీ.. మామిడి పూత లో ఉన్న ఔషధ గుణాలు గురించి మాత్రం తీసుకోవడం లేదు.. మామిడి పూతను ఈ విధంగా తీసుకుంటే తలనొప్పి నుంచి కాళ్ల నొప్పులకు చెక్ పెట్టవచ్చు..!మామిడి పువ్వులలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి.
ఇంకా యాంటీ డయాబెటిక్ గుణాలు కలిగి ఉంది. మామిడి పూతను కోసి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా తయారుచేసుకున్న కషాయం ఉదయం పూట తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మామిడి పూత లో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు మధుమేహాన్ని నియంత్రిస్తుంది పలురకాల పరిశోధనలలో తేలింది. ప్రతిరోజు పరగడుపున ఒక గ్లాస్ ఈ కషాయం తాగితే మధుమేహానికి శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.మామిడి పూత కషాయాన్ని తాగితే శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్థాలను తొలగిస్తుంది.
ఫలితంగా బరువు తగ్గవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు ప్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది. చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కషాయాన్ని తీసుకుంటే అన్ని సమస్యలు తగ్గుతాయి. ఫుడ్ పాయిజన్, కడుపునొప్పి, డీహైడ్రేషన్, వడదెబ్బ, అలసట వంటి సమస్యలను కూడా ఈ కషాయం తగ్గిస్తుంది. యూరినరీ ట్రాక్ ను శుభ్రంగా ఉంచుతుంది. మూత్రపిండ సంబంధిత సమస్యలు రాకుండా మనల్ని రక్షిస్తుంది.