Beauty Benefits : తొక్కే కదా అని పారేయకండి.. ఈ ఉపయోగాలు తెలిస్తే పారేయరు..!

Beauty Benefits : సామాన్యుడి యాపిల్ లా అరటి పండును అభివర్ణిస్తారు.. యాపిల్ పండు లో ఎన్ని రకాల పోషక విలువలు ఉన్నాయో.. అంత కంటే ఎక్కువ పోషకాలు అరటిపండులో దాగి ఉన్నాయి.. అందుకే రోజుకో అరటి పండు తినమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.. సాధారణంగా అరటిపండు నీటిని దాని తొక్కను పారెస్తం.. కానీ ఆ తొక్కలో కూడా బోలెడు ప్రయోజనాలున్నాయి అంటున్నారు డాక్టర్లు..!నిజానికి అరటి పండుతో పోలిస్తే తొక్కలోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి.

ఇందులోనే ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంది. అరటిపండు తొక్క ను తింటే శరీరానికి కావలసిన పీచుపదార్థం అంది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. త్వరగా ఎముకలు విరిగిపోకుండా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అరటిపండు తొక్క తింటే అందులో ఉండే పొటాషియం వలన హై బీపీ తగ్గుతుంది.అరటిపండు తొక్క దంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు.

Health And Beauty Benefits Of Banana Peel
Health And Beauty Benefits Of Banana Peel

పళ్ళు పసుపు రంగులోకి మారినప్పుడల్లా వాటిని తెల్లగా మార్చేందుకు అరటిపండు తొక్క సహాయపడుతుంది. అరటిపండు తొక్కతో పంటిపై రుద్దితే దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి. ముఖంపై మొటిమలు తగ్గించడానికి కూడా అరటి తొక్క పనిచేస్తుంది. అరటి తొక్కతో ముఖంపై రుద్దితే మోముపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది.