Chanakya Niti : ఈ పనుల తర్వాత తప్పకుండా స్నానం చేయాలి.. లేకపోతే ఆర్థిక నష్టం తప్పదు చాణక్య ..!!

Chanakya Niti : చాణక్య నీతి శాస్త్రం ప్రకారం ఎన్నో విషయాలను మనుషుల మనుగడకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇకపోతే ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే తల స్నానం చేయాలి అని పండితులు చెబుతుంటారు. పురాణాల ప్రకారం ప్రతిరోజూ మూడుసార్లు స్నానం చేయాలని.. బ్రహ్మ ముహూర్తంలో ఒకసారి, మధ్యాహ్నం , సాయంత్రం వేళల్లో కూడా స్నానం చేయాలి. కానీ ప్రస్తుతం బిజీ లైఫ్ స్టైల్లో ఎవరికి అలా సాధ్యపడడం లేదు. కొంతమంది సమయం లేక స్నానం చేయలేకపోతే.. మరి కొంత మంది నీటి కొరతతో స్నానం చేయలేక పోతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పనులు చేసిన తర్వాత స్నానం చేయాలి అని లేకపోతే ఆర్థిక నష్టం కూడా కలుగుతుందని చాణుక్యుడు చెబుతున్నాడు.

1. అంత్యక్రియల తర్వాత : పెళ్లిళ్లకు వెళ్లకున్నా సరే చావుల కు వెళ్లాలి అని అంటూ ఉంటారు. అయితే చనిపోయిన వారిని చూడడానికి వెళ్ళినప్పుడు.. చనిపోయిన వారి శరీరం బ్యాక్టీరియాతో పోరాడగలిగే శక్తి వుండదు. ఫలితంగా అంత్యక్రియల సమయంలో వారి శరీరంలోని బ్యాక్టీరియా మన శరీరంపై కి చేరుకునే ఆస్కారం వుంటుంది. అంత్యక్రియల తర్వాత ఎవరిని తాకకూడదు.. ఇంట్లోకి ప్రవేశించకూడదు అంటారు కారణం ఈ బ్యాక్టీరియా.. అందుకే అంత్యక్రియల నుంచి వచ్చిన తర్వాత నేరుగా స్నానం చేసిన తర్వాత ఇంట్లో కి వెళ్ళాలి. ఇలా చేయకపోతే అనారోగ్యం కలగడమే కాకుండా ఆర్థిక నష్టం కూడా కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించే అవకాశాలు కూడా ఉంటాయి.

Must take a bath after these works otherwise financial loss is inevitable Chanakya
Must take a bath after these works otherwise financial loss is inevitable Chanakya

జుట్టు కత్తిరించుట : జుట్టు కత్తిరించిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి. లేకపోతే జుట్టు కత్తిరించిన తర్వాత చిన్న చిన్న వెంట్రుకలు శరీరంపై ఉండే బ్యాక్టీరియా కి ఆహారం గా మారుతాయి. ఫలితంగా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే తప్పకుండా తల స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించాలి.

ప్రతి వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్ చేసి తలస్నానం చేయడం వల్ల ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా సరే బయటకు తొలగిపోతుంది. అంతే కాదు మన వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇక ఇలాంటి ఆర్టికల్స్ ప్రతి ఒక్కరికి వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా చేసి సమాచారాన్ని అందించండి.