Health Benefits : ఈ తైలం గురించి తెలిస్తే వద్దన్నా మీరే తెచ్చుకుంటారు..!

Health Benefits : నీలగిరి చెట్టు అదేనండి జామాయిల్ చెట్టును మనలో ప్రతి ఒక్కరూ చూసే ఉంటాం.. దీనినే యూకలిప్టస్, మైసూర్ గమ్ అని రకరకాలుగా పిలుస్తుంటాం.. నీలగిరి కొండల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి దీనిని నీలగిరి చెట్టు అని పిలుస్తారు. ఈ చెట్టు ఆకులతో నీలగిరి తైలం తయారు చేస్తారు.. జామాయిల్ ఆకులు, బెరడు, వేర్లను ఆయుర్వేద వైద్యంలో ఎప్పటి నుంచో వాడతారు.. నీలగిరి తైలం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!

నీలగిరి తైలం వాసన ఘాటుగా ఉంటుంది. ఇది నొప్పులను నివారిస్తుంది. తలనొప్పి సమస్యతో బాధపడుతున్నవారు నీలగిరి తైలాన్ని నుదుటిపై రాసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఒక క్లాత్ మీద నీలగిరి తైలాన్ని వేసుకుని వాసన పీల్చితే జలుబు, గొంతునొప్పి, దగ్గు తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు నీలగిరి తైలం రాసుకుని మసాజ్ చేసి ఆ తరువాత గోరువెచ్చటి నీటితో కాపడం పెట్టుకుంటే నొప్పులన్నీ ఫటాఫట్..నడుం నొప్పి ఉన్నవారు వేడినీటిలో నీలగిరి తైలం వేసి కాపడం పెడితే నడుము నొప్పి తగ్గుతుంది.

Pain Killer Of Nilagiri Thailam Health Benefits
Pain Killer Of Nilagiri Thailam Health Benefits

మీరు స్నానం చేసే నీటిలో 8 చుక్కలు నీలగిరి తైలం వేసి స్నానం చేస్తే.. అన్ని రకాల శారీరక నొప్పులు తగ్గిపోతాయి. మనసుకు హాయిని అందిస్తాయి. మడమ నొప్పి తో బాధపడుతున్న వారు నొప్పి ఉన్న చోట నీలగిరి తైలం రాసి మసాజ్ చేయాలి. ఇలా చేస్తే మడమ నొప్పి త్వరగా తగ్గిపోతుంది. గోరువెచ్చటి నీటిలో మూడు చుక్కలు ఈ నూనె వేసి ఆ నీటిని తాగితే గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. పిప్పి పన్ను నొప్పితో బాధపడుతున్నవారు చంప మీద నీలగిరి తైలం రాస్తే నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.