Tomatoes : అలాంటివారు టమోటాలను అస్సలు తినకూడదట..!!

Tomatoes : టమోటాలు ఆరోగ్యానికే కాదు సౌందర్యాన్ని పెంపొందించడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. రుచికి పుల్లగా, తియ్యగా ఉండే టమోటాలు ఆహారానికి మంచి రుచిని అందిస్తాయి అని చెప్పవచ్చు. టమోటాలను ఎక్కువగా కూరల్లోనే కాకుండా సాస్ రూపంలో , సలాడ్స్ రూపంలో ఉపయోగిస్తారు. అన్ని సీజన్లలో విరివిగా లభించే టమోటాలలో ఆరోగ్య విలువలు ఎక్కువ అని చెప్పవచ్చు. టమోటాలో దాగివున్న పోషకాల విషయానికి వస్తే కాల్షియంతో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరంగా ఉంచడమే కాకుండా ఎముకలకు వచ్చే ఆర్థరైటిస్ సమస్యలు కూడా దూరం చేస్తాయి.టమోటాలలో లభించే విటమిన్ సి వల్ల కంటిచూపును మెరుగు పరచుకోవడమే కాకుండా చర్మం పైన వచ్చే నల్లటి మచ్చలు, మొటిమలు కూడా దూరమవుతాయి.

అయితే టమోటాలను అతిగా తింటే మాత్రం శరీరానికి నష్టం ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా టమోటాలను తినకూడదట. ఇక ఎవరెవరు అనే విషయానికి వస్తే జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయని వారు.. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నవారు టమోటోలను తినడం వల్ల సమస్య తీవ్రతరం అవుతుంది. ముఖ్యంగా వీటిని తినడం వల్ల ఎసిడిటీ సమస్య కూడా వస్తుంది. గుండెల్లో మంట , గ్యాస్ సమస్యతో బాధపడతారు కాబట్టి ఇలాంటి వారు టమోటాలను తినకపోవడమే మంచిది.ఇక కీళ్లనొప్పితో బాధపడుతున్న వారు కూడా టమోటాలను దూరంగా ఉంచడమే చాలా అవసరం.

Such people should not eat tomatoes at all 
Such people should not eat tomatoes at all

ఎందుకంటే కీళ్లలో వచ్చే సమస్యలను మరింత పెంచడమే కాకుండా కీళ్లలో వాపులు, నొప్పులు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కూడా టమోటా ను దూరంగా ఉండడం చాలా ఉత్తమం. అంతేకాకుండా అతిసారం తో బాధపడే వారు కూడా టమోటా లకు దూరంగా ఉండాలి. లేకపోతే విరేచనాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక టమోటా లో ఉండే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా డయేరియా సమస్యకు దారి తీస్తుంది. ఇక కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు కూడా టమోటా లకు దూరంగా ఉండాలి. 90 శాతం మందికి కాల్షియం ఆక్సైడ్ వల్ల కిడ్నీలో రాళ్లు సమస్యలు ఏర్పడుతున్నాయట. ఈ సమస్యలు ఉన్నవారు టమోటాలను తినకపోవడమే మంచిది.