Financial loss : మనదేశంలో చాలామంది సాధారణంగా ఇల్లు నిర్మించుకునే టప్పుడు వాస్తు శాస్త్రాన్ని అనుసరించి ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం అనేది చాలా తప్పనిసరి . లేకపోతే ఆ ఇంట్లో గొడవలు, కలహాలు, మనశ్శాంతి లేకపోవడం, అశాంతిగా అనిపించడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఇంటిని వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించుకోవడమే కాదు ఇంట్లో అలంకరించే వస్తువులను కూడా మనం వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించాల్సి ఉంటుంది. మనం ఉండే బెడ్ రూమ్ తోపాటు లివింగ్ రూమ్ అలాగే ఫర్నిచర్, ఇంట్లో పెట్టే బొమ్మలు , బాత్రూం ఇలా అన్నీ కూడా వాస్తు శాస్త్రం ప్రకారమే నిర్మించుకోవాలి లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ముఖ్యంగా ఇంటి ని నిర్మించేటప్పుడు ఇంటి యొక్క బాత్ రూమ్ కూడా ఖచ్చితంగా ఏ దిశలో నిర్మించాలో కూడా వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూం నిర్మించకపోతే ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంటి బాత్రూం ఎప్పుడూ కూడా ఆగ్నేయంలో ఉంచకూడదు. ఎందుకంటే మరుగుదొడ్డి ఆగ్నేయంలో నిర్మించడం వల్ల అశుభం పైగా ఆర్థిక ఇబ్బందులు , కష్టాలు , అప్పులు ఎదురవుతాయి. అంతేకాదు వ్యాపారం, అభివృద్ధికి అంతరాయం కలుగుతుంది. ఇక టాయిలెట్ రంగు ఆకుపచ్చ గా వుంటే అది జీవితంలో ప్రతి అంశంలో కూడా ప్రభావం చూపుతుంది.

ముఖ్యంగా యజమాని పెద్ద సంతానం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రశాంతత కరువవుతుంది .. మనసంతా గందరగోళంగా ఉంటుంది. మీరు ఆగ్నేయ మూలలో బాత్రూం నిర్మించిన తర్వాత అక్కడి నుంచి తీయలేని పరిస్థితి ఏర్పడితే ఒక గిన్నెలో సముద్రపు ఉప్పు వేసి బకెట్ లో నీళ్ళు ఎప్పుడు ఉండేలా చూసుకుంటే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. అంతేకాదు టాయిలెట్ కి తూర్పు గోడపై గాజు కిటికీలు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి . టాయిలెట్ తలుపుల మీద దేవతలకు సంబంధించిన చిత్రాలను ఎప్పుడూ కూడా ఉంచకూడదు. బాత్రూమ్ ను ఎప్పుడూ కూడా ఉత్తర , తూర్పు దిశల్లో ఉండేటట్లు మాత్రమే నిర్మించుకోవాలి.