Blood Pressure : బీపీ తగ్గిందా.. ఇలా చేయండి..

Blood Pressure : శరీరంలో బీ పీ ఎక్కువైనా.. తక్కువైనా అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా బిపి ఎక్కువైనప్పుడు కొన్ని రకాల జబ్బులు వస్తే .. బీపీ తక్కువ అయినప్పుడు మరి కొన్ని జబ్బులు వస్తాయి అలాంటప్పుడు శరీరంలో బీపీ స్థాయిలను స్థిరంగా ఉంచుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు. బీ పీ తక్కువగా ఉండే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అంటే హఠాత్తుగా కళ్లు తిరగడం, చీకట్లు కమ్మి నట్లు అనిపిం చడం, అపస్మారక స్థితిలోకి చేరుకోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అంతే కాదు ఒక్కోసారి తల తిరిగినట్లు కూడా అనిపిస్తుంది.ఇక పోతే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మెదడుకు తగినంత రక్తసరఫరా జరగకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.

హైపో టెన్షన్ వల్ల వచ్చే ప్రధాన లక్షణాలు ఏమిటంటే తల తిరగడం, మూర్ఛ, కళ్ళ కింద నల్లటి వలయాలు, వికారం, వాంతులు, చేతులు చల్లగా మారిపోవడం, చెమటలు పట్టడం , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్యతో బాధపడే వారు నిత్యం కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే హైపోటెన్షన్ ఎక్కువై ఒక్కొక్కసారి వణుకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.ఇకపోతే రోజు కాఫీ లేదా టీ తీసుకునే వారికి ఇలాంటి సమస్యలు ఉండవు. ఇకపోతే కాఫీ లో ఉండే కెఫిన్ లో బీపీ కి ఔషధంగా పనిచేస్తుంది.

Simple Tricks to Maintain Blood Pressure
Simple Tricks to Maintain Blood Pressure

బీపీతో ఇబ్బంది పడుతున్నట్లు అయితే లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది , కళ్ళు తిరగడం వల్ల సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే టీ లేదా కాఫీ తాగడం ఉత్తమం. నిమ్మరసం తాగడం వల్ల కూడా తక్కువ రక్తపోటు సమస్య దూరమవుతుంది. డీహైడ్రేషన్ కూడా బిపి తక్కువ అవ్వడానికి కారణం అవ్వచ్చు. కాబట్టి రోజుకు అవసరమైన.. తగినన్ని నీళ్లు తాగాలి. నీళ్లు తాగాలి అనుకునేవాళ్ళు నిమ్మరసం జోడిస్తే ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.మజ్జిగ తాగడం వల్ల కూడా తక్కువ రక్తపోటు సమస్య దూరమవుతుంది. మజ్జిగలో ఉప్పు, జీలకర్ర పొడి కలిపి తాగితే డీహైడ్రేషన్ సమస్య తో పాటు రక్తపోటు సమస్య కూడా అదుపులో ఉంటుంది.