Tulsi Plant : ఇంట్లో తులసి మొక్క నాటడానికి ఏ రోజు మంచిదో తెలుసా..?

Tulsi Plant : సనాతన హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువులు తులసి మొక్కలను దేవతగా కొలుస్తారు. లక్ష్మీదేవి రూపం గా విశ్వసిస్తూ నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఈ తులసి మొక్క ఇంటి యజమాని యొక్క భవిష్యత్తు కూడా చెప్పగలదు అని మన పెద్దలు విశ్వసిస్తారు. ఇంతటి పవిత్రమైన తులసి మొక్కను ఎప్పుడు ఇంట్లో నాటాలి.. తులసి కోటను పెట్టడానికి ఏది శుభసమయం.. ఏ రోజు మంచిది అనే విషయాలను పూర్తిగా తెలుసుకోవాలి. ఇంట్లో తులసి కోట ను ఏర్పాటు చేసుకుని పూజించడం వల్ల ఆనందం, శాంతి , ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుంది. ఒక్కోసారి తులసి మొక్క ఎండిపోతే దాని ప్లేస్ లో మరొక కొత్త తులసి మొక్కను ఏర్పాటు చేయాలని అనే వారు కూడా చాలా మంది ఉంటారు . అలాంటి సందర్భాలలో మొక్కలు నాటడానికి ఏ రోజు మంచిది.. పండితులు ఏం చెబుతున్నారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసి మొక్కలు నాటడానికి కార్తీకమాసం ఉత్తమమైనది. ఏడాదిలో అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యకాలంలో కార్తీకమాసం వస్తుంది కాబట్టి ఇంట్లో కొత్త తులసి మొక్కలు నాటాలి అంటే ఈ సమయం చాలా పవిత్రమైనది.

Do you know what day is best a Tulsi plant at home
Do you know what day is best a Tulsi plant at home

ఇంట్లో కార్తీక మాసంలో తులసి మొక్కలు నాటేటప్పుడు గురువారం చాలా ఉత్తమమైన రోజుగా పండితులు పరిగణిస్తారు. శ్రీ హరి విష్ణువు కు పూజలు చేస్తారు. తులసి శ్రీకృష్ణుడికి గురువారం చాలా ఇష్టమైనది. అందుకే గురువారం ఇంట్లో తులసి మొక్కలు నాటితే విష్ణువు అనుగ్రహం లభిస్తుందట. ముఖ్యంగా చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులలో గురు, శుక్రవారాల్లో కూడా తులసి మొక్కను ఇంట్లో నాటవచ్చు. శుక్రవారం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి శుక్రవారం రోజున తులసి మొక్కను నాటి పూజ చేస్తే మంచి జరుగుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను వాట్స్అప్ ద్వారా ఇతరులకు షేర్ చేయండి.