Ganapati Puja : గణపతి పూజ చేసేటప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి..!!

Ganapati Puja : ఇంట్లో ఏదైనా శుభకార్యం మొదలు పెట్టేటప్పుడు లేదా దైవకార్యం నిర్వహించేటప్పుడు కచ్చితంగా గణపతికి పూజ చేయాలన్నది ఆనవాయితీ.. వినాయకుడు ఆది దేవుడు కాబట్టి వినాయక పూజ జరిగిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని అయినా సరే మొదలు పెట్టాలి. కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో కోలాహలంగా జరుపుకునే వినాయకచవితి కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూజ తో మొదలై నిమజ్జనం వరకు భక్తులందరూ ఎంతో ఉల్లాసంగా , సంతోషంగా ఈ వేడుకను జరుపుకుంటారు. ఇకపోతే ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితి ని జరుపుకుంటారు.ఇలాంటి పవిత్రమైన విఘ్నేశ్వరుడిని అంగపూజ లో ప్రతి భాగాన్ని ఆరాధించాలి. ఇక అందులో ఎలాంటి తప్పులు కూడా ఉండకూడదు. మీరు కూడా విఘ్నేశ్వరుడికి పూజ చేయడానికి సిద్ధమవుతూ వుంటే ఈ పూజా విధానాలను తప్పకుండా తెలుసుకోవాలి. వినాయకుడి ప్రతి అంగానికి కూడా ప్రత్యేక మంత్రాలు ఉన్నాయి.

ఇక వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత అంగ పూజ చేయాలి. ముందుగా గణేశుని పాదాలను పూజించేటప్పుడు ఓం గణేశ్వరాయ నమః పాదౌ పూజయామి.. మంత్రాన్ని జపించాలి. మెడ భాగాన్ని పూజించేటప్పుడు.. ఓం అఖువాహనాయ నమః ఊరూ పూజయామి అనే మంత్రాన్ని జపించాలి.ఇక నడుము భాగాన్ని పూజించేటప్పుడు ఓం హీరాంబాయ నమః కటి పూజయామి అనే మంత్రాన్ని పఠించాలి ఆ తర్వాత నాభిని కొలిచేటప్పుడు ఓం కమృసూన్వే నమః నాభి పూజయామి అంటూ మంత్రం జపిస్తూ నే పొట్ట భాగం కోసం ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి అనే మంత్రాన్ని చదవాలి.ఛాతీ ఆరాధన కోసం ‘ఓం గౌరీసుతాయ నమః స్తనౌ పూజయామి’, హృదయం కోసం

Do not make such mistakes while Ganapati Puja
Do not make such mistakes while Ganapati Puja

‘ఓం గణనాథాయ నమః హృదయం పూజయామి’, గొంతు భాగం కోం ‘ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి’, భుజారాధన కోసం ‘ఓం పాషాహస్తాయ నమః స్కంథౌ పూజయామి’, చేతుల కోసం ‘ఓం గజవక్త్రాయ నమః హస్తం పూజయామి’, మెడ భాగం కోసం ‘ఓం స్కందగ్రజాయ నమః వక్త్రం పూజయామి’ అనే మంత్రాలను చదవాలి. ఇవి కాకుండా నుదుటి భాగం కోసం ‘ఓ విఘ్నరాజాయ నమః లాలాటం పూజయామి’, శిరస్సు కోసం ‘ఓం సర్వేశ్వరాయన నమః శిరః పూజయామి’ అనే మంత్రాన్ని జపించాలి.ఈ మంత్రాలు చదువుతున్నప్పుటు విఘ్నేశ్వరుని ప్రతి అంగానికి ధూపాన్ని ఇవ్వాలి. తెలిసి తెలియకుండా చేసిన పొరపాట్లను క్షమించమని గణేశుని వేడుకోవాలి. భక్తిశ్రద్ధలతో గణేశుడికి పూజలు నిర్వహించాలి. ప్రతి ఒక్కరికి అవసరమైన ఈ ఆర్టికల్ను మీరు వాట్స్అప్ ఫేస్బుక్ ద్వారా అందరికీ షేర్ చేయండి.