Beauty Tips : ముఖంపై మొటిమలను దూరం చేసే వంటింటి చిట్కా..?

Beauty Tips : సాధారణంగా ప్రతి ఒక్కరిలో టీనేజ్ వయసు వచ్చిందంటే చాలు ముఖం మీద మొటిమలు వస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో యుక్తవయసు దాటినవారిలో కూడా మొటిమలు రావడం సహజం అయిపోయింది. ముఖ్యంగా చర్మ సంరక్షణ అలవాట్లు.. వాతావరణ పరిస్థితుల వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంది. మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా సరే మొటిమలతో ఇబ్బంది పడుతున్నట్లు అయితే ఈ ఆర్టికల్ ను వాట్స్అప్ ద్వారా షేర్ చేసి వారికి సహాయపడగలరు. వంటింట్లో చిట్కాలు ఉపయోగించి చర్మం పై వచ్చిన మొటిమలను ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

టమాటా.. టమాటా అందరి ఇళ్ళల్లో లభిస్తుంది. ముఖ్యంగా టమాటాలలో మనకు విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల చర్మ రంగును మెరుగు పరచడంతో పాటు ముఖంపై వచ్చే మచ్చలు దూరం చేయడంలో చాలా సమర్ధవంతంగా సహాయపడుతుంది. ఇక టమాటా తో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడడం వల్ల మొటిమలు దూరం అవుతాయి.రెండు చెంచాల టమాటా గుజ్జు తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం , మెడకు అప్లై చేసి పది నిమిషాలు ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడిగి వేయాలి.

removing pimples on tomato face pac
removing pimples on tomato face pac

ఇలా చేయడం వల్ల చర్మానికి కావలసిన తేమ కూడా లభిస్తుంది.ఒక టేబుల్ స్పూన్ శనగపిండి లోకి ఒక టేబుల్ స్పూన్ టమాటా గుజ్జు వేసి బాగా కలపాలి. మెత్తటి పేస్టులాగా తయారైన ఈ మిశ్రమాన్ని.. ముఖానికి పూతలా వేయాలి. ఆ తర్వాత ముఖం పై నీళ్లు చల్లుకుంటూ స్క్రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా ఉండడంతోపాటు రంగు ని కూడా మెరుగుపరచుకోవచ్చు.ఓపెన్ పోర్స్ సమస్యతో బాధపడుతున్న వారు టమాటా గుజ్జులో ముల్తాని మట్టి కలిపి ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలగడమే కాదు ట్యాన్ సమస్య కూడా దూరం అవుతుంది.