Skin Care Tips : వేసవికాలంలో అబ్బాయిలు చర్మాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే..?

Skin Care Tips : వేసవి కాలం వచ్చిందంటే ముఖ్యంగా అమ్మాయిలు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడతారు. అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలు కూడా మండే వేసవికాలంలో చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఎండాకాలంలో వేడి గాలులు కూడా చర్మాన్ని తీవ్రంగా కాల్చేస్తాయి. అమ్మాయిల తో పోల్చుకుంటే అబ్బాయిలు చర్మం చాలా దృఢంగా ఉంటుంది . కానీ వేసవి కాలం అనేది ప్రతి ఒక్కరి చర్మంపై ప్రభావం చూపుతుంది. ఇక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎండాకాలంలో పలు జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం మరింత పొడిగా మారడంతోపాటు కాంతిని కూడా కోల్పోతారు.

వేసవికాలంలో ఎలాంటి రకమైన సన్ స్క్రీన్ కూడా ఉపయోగపడదు. ఇక చెమట, దుమ్ము, కలుషితమైన గాలి వల్ల చర్మ రంధ్రాలు కూడా మూసుకుపోయి..అనేక సమస్యలు కలుగుతాయి. మీ ఇంట్లో ఉండే అన్న, తమ్ముడు , బావ , బామ్మర్ది, మామ , తండ్రి ఇలా ఎవరైనా సరే చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లయితే వారికి ఈ ఆర్టికల్ ను వాట్సప్ లో షేర్ చేసి ఎండా కాలంలో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పవచ్చు. వేసవి కాలంలో మీ చర్మం నుండి తేమ అధికంగా బయటకు వెళ్ళిపోతుంది.. ఒకవేళ చర్మం జిడ్డుగా అనిపిస్తే శరీరంలో నీటి శాతం తక్కువగా ఉందని గుర్తించాలి.ఇకపోతే శరీరంలో తేమ లేకపోవడం వల్ల చర్మం అధికంగా నూనెలను స్రవిస్తుంది.

If boys want to take care of their skin in summer
If boys want to take care of their skin in summer

అలాంటప్పుడు శరీరానికి కావలసిన నీటిని తాగాలి. ఇక ఎక్కువగా తాజా పండ్లు కూడా తినాలి. ఈ వేసవి కాలంలో వచ్చే పుచ్చకాయ , కీరదోసకాయ వంటివి తినడం వల్ల పుష్కలంగా శరీరానికి నీరు అందుతుంది. బయటకు వెళ్ళినా సరే 30 ప్లస్ SPF ఉండే సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి. ఇలా ఉపయోగించడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.. వేడి నీటిని, రసాయనాలు అధికంగా వుండే ఉత్పత్తులను ఉపయోగించకూడదు. ఇక వేసవి కాలంలో చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. దుమ్ము , సూర్యకాంతి వల్ల ముఖ రంధ్రాలు మూసుకుపోతాయి. అలాంటప్పుడు ముఖాన్ని రెండు సార్లైనా చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.