Health Benefits : కీళ్ల నొప్పులు ఈ ఆకుతో పరార్..!

Health Benefits : వినాయక చవితి పూజలో వాడే 21 పత్రాలలో బృహతీ పత్రం కూడా ఒకటి.. దీనినే నేల మునగాకు, వాకుడాకు అని పిలుస్తారు. ఈ చెట్టుకి నీలిరంగు, తెలుపు రంగు పువ్వులు పూస్తాయి. బృహతీ పత్రం లో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. ఆ ఆకుల వలన కీళ్ల నొప్పులు ఏ విధంగా తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!బృహతీ పత్రం ఆకులు సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్ గా పని చేస్తాయి..

ఈ ఆకులలో ఉప్పు కలిపి మెత్తగా దంచి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులు ఉన్నచోట రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. పెయిన్ కిల్లర్ గా పని చేసి నొప్పిని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పుల, వెన్ను, నడుము నొప్పిని తగ్గిస్తుంది. నాలుగు ఆకులు తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి వడపోసుకోవాలి. ఈ కషాయం నోట్లో పోసుకొని పుక్కిలించి ఉసేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది.

Remedies for Knee Pain Bruhathi Leaves Health benefits
Remedies for Knee Pain Bruhathi Leaves Health benefits

ఈ కషాయం చక్కటి మౌత్ ఫ్రెష్నర్ లా పనిచేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలగిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంటుంది.ఈ ఆకులను వేడి సెగ గడ్డలపై వేసి కట్టుకడితే సెగ గడ్డల తగ్గుతాయి. ఈ ఆకులను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే అన్ని రకాల చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఈ పొడిని అన్ని రకాల నొప్పులకు రాసుకుంటే నొప్పుల నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.