Health Benefits : బుడమ కాయ మొక్క తో లాభాలెన్నో..?

Health Benefits : పల్లెటూళ్లలో ఎక్కువగా పొలాలలో ఈ మొక్కను మనం చూడవచ్చు. దీనిని బుడమ కాయ మొక్క అని పిలుస్తారు. ఇక ఈ మొక్కలు ఎక్కడ పడితే అక్కడ.. రోడ్డుకిరువైపులా. పంట పొలాల్లో .. గుట్టలలో కూడా ఉదారంగా పెరుగుతూంటాయి. అయితే ప్రాంతాలనుబట్టి ఈ మొక్కను అంటి కుప్పంటి.. బుడ్డి మామ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ మొక్కకు ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. బుడమ కాయ మొక్క అనేది సొలనేసి కుటుంబానికి చెందినది . దీని శాస్త్రీయ నామం ఫిసాలిస్. అయితే ఈ బుడమ కాయలను సపరేట్ గా వండి జామ్ లేదా జ్యూస్, జెల్లీ రూపంలో కూడా తినవచ్చు.

ఇందులో ఉండే పోషకాల విషయానికి వస్తే.. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. అంతేకాదు కొల్లాజెన్ ఏర్పడడంలో కూడా మొదటి పాత్ర పోషిస్తుంది. ఫలితంగా చర్మం పై మచ్చలు , మొటిమలు దూరం అవడమే కాదు ఎలాంటి గాయాలు అయినా సరే నయం కావడం లో దోహదపడుతుంది. ఇక విటమిన్ సి అధికంగా లభించడంతో పాటు ఇతర పోషకాలను కూడా మనం ఈ మొక్క ద్వారా సొంతం చేసుకోవచ్చు. విటమిన్ ఈ తో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా తయారు చేయడానికి ఈ మొక్క చాలా బాగా సహాయపడుతుంది.

Health Benefits with budama plant 
Health Benefits with budama plant

యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు కలిగి ఉంటుంది. ప్రతి రోజు తినడం వల్ల క్యాల్షియం అవసరాలను కూడా తీర్చుకోవచ్చు. అంతేకాదు హార్మోన్ల ఉత్పత్తి , ఆరోగ్యకరమైన రక్తనాళాలకు సహాయం చేయడానికి ఈ బుడమ కాయలు బాగా ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి అలాగే మలబద్ధకాన్ని నివారించడానికి, పెద్ద పేగు క్యాన్సర్ను దూరం చేయడానికి కూడా ఈ బుడమ కాయ మొక్కలు బాగా సహాయపడుతాయి. ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ఈ మొక్కల గురించి అందరికీ తెలియాలి అంటే వాట్స్ అప్ ద్వారా ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి అలాగే వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ మొక్క ఫలితాలను పొందవచ్చు.