Money : డబ్బు నిలవడం లేదా.. అయితే ఈ దిశలో డబ్బు పెడుతున్నారేమో గమనించండి..!!

Money : ఇంట్లో వాస్తు దోషం సరిగ్గా లేకపోతే ఏ పని చేసిన సవ్యంగా నెరవేరదు. ముఖ్యంగా వాస్తు దోషం ఉన్న ఇళ్లల్లో అభివృద్ధి కలగకపోగా.. అశాంతి, కుటుంబ సభ్యుల మధ్య తరచూ మనస్పర్ధలు, గొడవలు ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక వాస్తు సరిగా ఉన్నట్లయితే దరిద్రులు కూడా ధనవంతులు అవుతారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇంట్లో వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలని జ్యోతిష్యులు కూడా చెబుతూ ఉంటారు. ఇక వాస్తు దోషం వల్ల ఇంట్లో వాతావరణం ప్రతికూలంగా మారడంతో పాటు గొడవలకు కారణమవుతుంది.

ఇంట్లో ప్రతి మూలా కూడా వాస్తు దోషం ప్రకారం ఉన్నట్లయితే ఆ ఇంట్లో వ్యక్తులు ఎప్పుడు కలకలలాడుతూ సంతోషంగా ఆ ఇంట్లోని వారు ఆరోగ్యాలతో సుఖంగా జీవిస్తారు. ఇక మీ ఇంట్లో కూడా పెట్టిన డబ్బు నిలవడం లేదా..? ఒకవేళ మీరు ఈ దిశలో పొరపాటున డబ్బు పెడుతున్నారేమో ఒకసారి గమనించండి.. ఇలా చాలా మంది తెలియక ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ ఈ ఆర్టికల్ ను వాట్సాప్ ద్వారా షేర్ చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి. ఇక ఏ మూలన పెడితే డబ్బు నిల్వదో ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.

Money standing or but notice if money is being invested in this direction
Money standing or but notice if money is being invested in this direction

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఖజానా ముఖం ఎల్లప్పుడూ కూడా తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. ఇది కుబేరుడి దిక్కు. ఇలా చేస్తే ఇంట్లో ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదు.. ఇక ఈ దిశకు ఎదురుగా ఉన్న ఖజానా ఎప్పుడూ కూడా బంగారం , వెండి, సంపదలతో తులతూగుతూ ఉంటుంది. ఇక పడమర లేదా దక్షిణం వైపు న ఖజానా వుండే బీరువా పెడితే డబ్బు నష్టాన్ని కలుగజేస్తుంది. ఆ ఇంటి మనిషి ఎంత డబ్బు సంపాదించినా కూడా వృథాగా డబ్బు మొత్తం ఖర్చయిపోతుంది. అంతేకాదు అప్పుల్లో మునిగే ఆస్కారం కూడా వుంటుంది. అందుకే కేవలం ఉత్తరం లేదా తూర్పు ముఖం మాత్రమే మీ ఇంటి బీరువా ఉండేలాగా చూసుకోండి.