Beauty Tips : సాధారణంగా చాలా మంది ముఖం పై తీసుకున్న అంత శ్రద్ధ మెడ పైన తీసుకోరు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే చాలామంది మెడపైన అంత ఎక్కువగా శ్రద్ధ చూపించరు. ఫలితంగా మెడ చూడటానికి నల్లగా , ముడతలు పడి పోయి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ముఖం మాత్రమే అందంగా ఉంటే సరిపోదు.. మెడ కూడా అందంగా ఉన్నప్పుడే రెట్టింపు అందం మన సొంతం అవుతుంది. ఇకపోతే మెడ అందంగా తీర్చి దిద్దుకోవడానికి కొన్ని రకాల చిట్కాలను ఇప్పుడు మేము ఈ ఆర్టికల్ ద్వారా మీ ముందుకు తీసుకు వచ్చాము.
ఇక అందరికీ ఉపయోగపడే ఈ ఆర్టికల్ ను వాట్సాప్ ద్వారా షేర్ చేయండి.ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మాయిశ్చరైజర్ ను అలాగే సన్ స్క్రీన్ లోషన్ ను రెండింటినీ కూడా ముఖంపైన అలాగే మెడ పైన కూడా అప్లై చేయాలి. సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించడం వల్ల చర్మం మీద నల్లటి మచ్చలు, గీతలు , ముడతలు ఏర్పడవు. పైగా చర్మం యవ్వనంగా తయారవుతుంది. ఇక స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజింగ్ లోషన్ ను మెడ కూడా రాసుకోవాలి. ఇలా చేస్తే మెడ భాగంలోని చర్మానికి పోషణ అలాగే తేమ కూడా అందుతుంది.
ఇక ముఖ సౌందర్యానికి ఫేస్ మాస్క్ ఎలా అయితే వాడతారో అదే ఫేస్ మాస్క్ ను మెడకు కూడా అప్లై చేయాలి. ఇలా చేయడం వలన మెడ మీద ఉండే గీతలు, ముడతలు తొలగిపోయి చర్మం తాజాగా ఉంటుంది.ఇక మీరు మేకప్ వేసుకునేటప్పుడు కూడా మెడ భాగం పైన దృష్టి పెట్టి గీతలు, మచ్చలు కనపడకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా పసుపుతో వారానికి రెండు సార్లు మెడపైన అప్లై చేస్తూ శుభ్రం చేసుకుంటూ ఉండటం వల్ల నల్లటి మచ్చలు, దుమ్ము , ధూళి, ముడుతలు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి