Health Benefits : పెద్ద పల్లేరు మొక్క గురించి ఈ రహస్యం తెలుసా..

Enugu Palleru: ముళ్ళ జాతికి చెందిన పల్లేరు మొక్కను చూసే ఉంటారు.. దీనిని ఏనుగు పల్లేరు, పెద్ద పల్లేరు చెట్టు అని పిలుస్తూ ఉంటారు.. ఈ మొక్కలో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి.. ఈ చెట్టు కాయలను ఆయుర్వేద వైద్యంలో పూర్వకాలం నుంచి వినియోగిస్తున్నారు..! ఇది కడుపు నొప్పి నుంచి సంతాన సమస్యలు వరకు అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది..!పెద్ద పల్లేరు కాయలను తెచ్చుకుని ఎండబెట్టి దంచి పొడిచేసుకోవాలి. ఈ పొడి 5 గ్రాములు, వావిలి ఆకు రసం 20 గ్రాములు కలిపి స్త్రీలు ఋతుక్రమం మొదటి రోజు రాత్రి తాగాలి.

ఈ విధంగా వరుసగా ఏడు రోజులపాటు తీసుకుంటూ భర్త తో సంసారం చేస్తే సంతానం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు మొత్తం భాగాన్ని తీసుకువచ్చి దంచి రసం తీయాలి .ఈ రసానికి రెండు రెట్లు పటిక బెల్లం పొడిని కలిపి మరిగించాలి. బాగా పాకం వచ్చాక దానిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పాకాన్ని ఒక చెంచా తియాసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి రోజు పరగడుపున తీసుకుంటే కాలేయ రోగాలు, అతివేడి, ఒళ్ళు మంటలు తగ్గిపోతాయి. శరీరంలో వేడిని తగ్గించి శరీరానికి చలువ చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

Medicinal Plant Enugu Palleru Health Benefits
Medicinal Plant Enugu Palleru Health Benefits

ఈ చెట్టు కాయలు కషాయం తాగితే డయేరియా సమస్యలు తగ్గిపోతాయి. ఈ చెట్టు ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంది. ఈ చెట్టు ఆకులను దంచి ఆ మిశ్రమాన్ని దురద, గజ్జి, తామర ఉన్నచోట రాస్తే అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. పెద్ద పల్లేరు కాయల చూర్ణం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి తీసుకుంటే వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది.