Tulsi Mala : తులసి మాల ప్రాముఖ్యత.. పాటించాల్సిన నియమాలు ఇవే..!!

Tulsi Mala : హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ముఖ్యంగా .. తులసి మొక్క యొక్క చెక్కతో తయారు చేసే తులసి మాల కి కూడా అంతే ప్రాముఖ్యత ఉండడం గమనార్హం. ఆహారానికి మతపరమైన ప్రాముఖ్యత ఉండడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. తులసి మాల గురించి సంబంధించి ప్రత్యేక నియమాలు కూడా ఒకసారి చదివి తెలుసుకుందాం..తులసి మొక్క కు ఎంత ప్రాధాన్యత ఇస్తామో తులసిమాల కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి తులసి మాల ధరించడానికి కూడా కొన్ని నియమాలను పాటించాలి.

తులసి మాల ధరించాలని అనుకునేవారు వ్యక్తి తమ ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కేవలం శాకాహారం మాత్రమే అంటే సాత్విక ఆహారాన్ని మాత్రమే తినవలసి ఉంటుంది. ముఖ్యంగా వారు తినే ఆహారంలో వెల్లులి , ఉల్లిపాయలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు. మాల ధరించిన వ్యక్తి ఎప్పుడూ మాంసం , మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరమే కాదు.. దేవతలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు అని పెద్దల నుంచి వినిపిస్తున్న కథనం.తులసి మాల వేసుకునేటప్పుడు గంగాజలంతో శుభ్రం చేసి పూజ చేసిన తర్వాతనే తులసీ మాలను ధరించాలి.

Importance of Tulsi Mala These are the rules to follow
Importance of Tulsi Mala These are the rules to follow

చేతితో తయారు చేసిన తులసిమాలను మాత్రమే ధరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. తులసి మాలను ధరించిన భక్తులు కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు జపించవలసిన ఉంటుంది. ఇతరులతో సత్ప్రవర్తనతో మెలగడం .. అడిగిన వారికి శక్తి కొలది సహాయం చేయడం.. ఇతరులను దుర్భాషలాడకపోవడం వంటివి పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ పాటించకపోతే తులసి మాల ధరించడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు కలగకపోగా పూర్తిగా ఆర్థిక నష్టం కూడా వాటిల్లుతుంది. తులసి మాల లక్ష్మీ దేవి స్వరూపం కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే తులసిమాల ధరించినపుడు ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి.