Health Problems : వేసవి కాలం రానే వచ్చింది.. నోరూరించే మామిడి పండ్లను తీసుకొచ్చింది.. ఇక ఎంతో రుచికరమైన.. కంటికి ఇంపుగా కనిపించే మామిడిపండును తినడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు.. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తినే పండ్ల లో మామిడిపండు కూడా ఒకటి. అందుకే అన్ని పండ్ల లో మామిడిపండు రారాజుగా పిలువబడుతోంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో లభించే మామిడి పండ్లను తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు లభించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. అయితే ఎంతో ఇష్టంగా తినే మామిడి పండ్లను కొన్ని పదార్థాలతో కలిపి తినకూడదట.
ఇకపోతే అమితంగా మామిడి పండ్లను ఇతర ఆహార పదార్థాలతో తినే ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.ఇక ఎలాంటి ఆహార పదార్థాలతో మామిడి పండ్లను కలిపి తినకూడదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మామిడి పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు.. ఇలా తాగడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక మామిడి పండు తిన్న తర్వాత సుమారుగా ఒక అరగంట పాటు ఏమీ తినకపోవడమే మంచిది. ఇక మరికొంతమందికి మజ్జిగలో, పెరుగులో మామిడిపండు గుజ్జు కలుపుకుని తినడం మనం చూస్తూనే ఉంటాం. ఇలా తినడం శరీరంలో వేడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
కాబట్టి పెరుగును, మామిడిపండును ఒకేసారి కలిపి తినకూడదు. ఇక చల్లటి పదార్థాలతో మామిడి పండును తినడం వల్ల శరీరంలో టాక్సిన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.మామిడి పండు తిన్న తర్వాత కాకరకాయతో తయారుచేసిన కూరలను అస్సలు తినకూడదు. ఇక డయాబెటిస్ తో బాధపడుతున్న వారు మామిడి పండును అన్నం తిన్న తర్వాత తినకూడదు. అలా తింటే వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఏదైనా చల్లటి పానీయాలతో మామిడి పండ్లను కలిపి తినకూడదు.ఇలా తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా కళ్లు తిరిగి పడిపోవడం వంటి సమస్యలు జరగవచ్చు. ఇక రోజుకు ఒకటి లేదా రెండు మామిడిపండ్ల కన్నా ఎక్కువగా తినకపోవడమే మంచిది.