Hanuman Jayanti : హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు అస్సలు చేయకండి..!!

Hanuman Jayanti : హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువులు ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇక హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన హనుమాన్ జయంతి ని జరుపుకోబోతున్నాం అంటే రేపు అంగరంగవైభవంగా హనుమాన్ భక్తులు హనుమాన్ జయంతిని చాలా ఘనంగా నిర్వహించనున్నారు. ఇక స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించడమే కాదు స్వామి వారిని ప్రసన్నం చేసుకోవడానికి పలురకాల నైవేద్యాలతో స్వామివారికి సమర్పించనున్నారు. ఇక స్వామి వారిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని శ్లోకాలు, చాలీసా చదవడం వల్ల స్వామివారు ప్రసన్నం అయి మనపై ఆయన దయ ఉంచుతారట.

ఇకపోతే ఈ హనుమాన్ జయంతి రోజున మరిచిపోయి కూడా మీరు ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదు. రేపే హనుమాన్ జయంతి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి. ముఖ్యంగా బజరంగబలిని పూజించేటప్పుడు చరణామృతాన్ని ఉపయోగించకూడదని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. హనుమాన్ జయంతి రోజున పూజ లు నిర్వహించేటప్పుడు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. లేదా మంగళవారం ఆంజనేయ స్వామికి ఉపవాసం ఉండేటట్లయితే ఉప్పు అసలు తినకూడదు. దానం చేసిన ఆహార పదార్థాలను కూడా తినకూడదు.

Do not make these mistakes at all on Hanuman Jayanti day
Do not make these mistakes at all on Hanuman Jayanti day

హనుమంతుడిని.. మరిచిపోయిన కూడా సూతకం సమయంలో పూజించకూడదు.. కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు సుష్టి ఉంటదని పరిగణిస్తారు కాబట్టి సూతకం సమయం మరణించిన తేదీ నుండి 13 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. ఇలాంటి సమయంలో హనుమంతుడికి పూజ చేయకూడదు.ఇక హనుమాన్ జయంతి రోజు బజరంగబలిని పూజించేటప్పుడు పసుపు, ఎరుపు బట్టలు మాత్రమే ధరించాలి. నలుపు, తెలుపు బట్టలు ధరించడం మానుకోవాలి. ఇక మీ ఇంట్లో లేదా గుడిలో విరిగిన విగ్రహం గనుక ఉంటే దానిని పూజించకూడదు. హనుమాన్ జయంతి రోజు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలి. ఎలాంటి ఇబ్బందులకు ఇతరులను గురి చేయవద్దు. ఇలా చేయడం వల్ల శని గ్రహం ఉగ్రత పెరుగుతుంది. ఇక హనుమాన్ జయంతి రోజు పగటిపూట నిద్ర పోకండి. వీలైతే ఈ సమయంలో హనుమాన్ చాలీసా చదవడం వల్ల స్వామివారి ఆశీస్సులు మీపై ఉంటాయి అని శాస్త్రం చెబుతోంది.