మనిషి ఆరోగ్యానికి జొన్నలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే మొదటి ఐదు ఆరోగ్యకరమైన ధాన్యాలలో జొన్నలు కూడా ఒకటి అని చెప్పవచ్చు. జొన్నలలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి పచ్చ జొన్నలు అయితే మరొకటి తెల్ల జొన్నలు. ఇక పచ్చ జొన్న పిండిని రొట్టెలు గా చేసుకొని ఆహారంగా వాడుతారు. దీనిని జోవర్ అని కూడా పిలుస్తారు. గ్లూటెన్ రహిత ప్రాపర్టీస్ కలిగిన ఈ జొన్న పిండితో తయారు చేసిన పదార్ధాలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఆరోగ్యం విషయం లో తీసుకుంటున్న జాగ్రత్తల నేపథ్యంలో జొన్న పిండితో తయారుచేసిన రొట్టెలను ఎక్కువగా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
జొన్న పిండి లో మనకు ఎక్కువ మొత్తంలో పీచు పదార్థం లభిస్తుంది. రోజుకు అవసరం అయ్యే దానిలో 48 శాతం పీచు జొన్నల నుండి లభించడం గమనార్హం. అంతేకాదు జొన్నలలో లభించే ఫైబర్ కారణంగా మల విసర్జన సాఫీగా జరుగుతుంది. గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలను నివారించడంలో చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. జొన్నల పై ఉండే పొర క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసు వారు వృద్ధులుగా కనిపిస్తున్నారు. ఇక ముందస్తు వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ తో ఇవి పోరాడతాయి.
జొన్న లలో ఉండే ఇనుము, మెగ్నీషియం, కాపర్, కాల్షియం వంటివి ఎముకలు అలాగే కణజాలాలను బలంగా మార్చడంలో దోహదపడతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించి తరచూ వచ్చే వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు జొన్నపిండి నుంచి మనకు లభిస్తాయి. ఫలితంగా తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణం కావడంతో పాటు రక్తంలో చక్కెర ఆలస్యంగా పెరుగుతుంది. అందుకే అధిక బరువుతో బాధపడేవారు అలాగే డయాబెటిస్తో ఇబ్బందిపడేవారు జొన్న పిండిని తమ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల ఇటువంటి సమస్యలు దరిచేరవు. ఇక్కడ ఎవరైతే డయాబెటిస్తో బాధపడుతున్న వారు అలాంటి వారికి ఈ ఆర్టికల్ను వాట్స్అప్ ద్వారా షేర్ చేసి వారి ఆరోగ్యాన్ని మెరుగు పరచవచ్చు.