Beauty Tips : చర్మసౌందర్యానికి వంటింటి చిట్కా..!

Beauty Tips : మహిళలు అందంగా ఉండడం కోసం ఎంత ఖర్చు పెట్టినా సరే తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఖరీదుతో అవసరం లేకుండా కేవలం ఇంట్లో దొరికే పదార్థాలతోనే మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు. ఇక చర్మ సౌందర్యాన్ని పెంపొందించే పదార్థాలలో శెనగపిండి మొదటి పాత్ర పోషిస్తుంది. శెనగపిండి ని ఉపయోగించి చర్మసౌందర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. మీ ఇంట్లో అక్క, చెల్లి, అత్త,అమ్మ, వదిన ఇలా ఎవరైనా సరే ఆడవారు ఉంటే వారికి ఈ ఆర్టికల్ ను వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.

గుడ్డు – శెనగపిండి ఫేస్ ప్యాక్ : గుడ్డులోని తెల్ల సొన తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి, అలాగే కొంచెం తేనె వేసి బాగా కలపాలి. దీనిని బాగా మిక్స్ చేసిన తర్వాత చర్మంపై అప్లై చేసి ఇరవై నిమిషాలు అలాగే ఆరనివ్వాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. అలాగే కొత్త చర్మకణాల ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. అయితే ఈ చిట్కాలు మీరు వారానికి రెండు లేదా మూడుసార్లు పాటించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా తాజాగా మెరుస్తుంటుంది.

Kitchen tip for Beauty Tips
Kitchen tip for Beauty Tips

శెనగపిండి – నిమ్మరసం ఫేస్ ప్యాక్ : ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకొని, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాలు తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నిమ్మరసంలో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఎండ కారణంగా వచ్చే నల్లటి మచ్చలు కూడా దూరం అవుతాయి.