కొంత మంది లో దంతాలు ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల దంతాలు రంగు మారుతూ ఉంటాయి. పసుపుపచ్చ రంగులోకి మారడం వల్ల నలుగురిలో హాయిగా నవ్వాలంటే మొహమాటపడే పరిస్థితికి రావాల్సి ఉంటుంది. దంతాలను ఎప్పుడు తెల్లగా ఉండేలా చూసుకోవాలి. ఇకపోతే చాలామంది తమ దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తూ ఉంటారు. వైద్యులు కూడా రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి అని సూచిస్తారు . మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే దంతాలు పసుపు పచ్చగా కనపడుతున్నట్లు అయితే కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలి.
బత్తాయి , అరటి పండు, సంత్రం పండు, నిమ్మకాయ తొక్కలలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. అది దంతాలను తెలుపు రంగు లోకి తీసుకు వస్తుంది. కాబట్టి ప్రతి రోజూ బ్రష్ చేసే ముందు అరటిపండు తొక్కలని దంతాలపై రుద్ది ఆ తర్వాత బ్రష్ చేయాలి. ఇలా ప్రతిరోజు బ్రష్ చేసే ముందు అరటి పండు తొక్క తో దంతాలపై రుద్దితే దంతాలు తెల్లగా మారతాయి.ఇక పురాతన కాలంలో ఉపయోగించిన బొగ్గు ద్వారా కూడా దంతాలకు మేలు జరుగుతుంది అని చెప్పవచ్చు. దంతాలను తల తల మెరిసేలా చేయడంతోపాటు నోటిలోని విషపూరితమైన బ్యాక్టీరియాను తరిమికొట్టడం లో బొగ్గు సమర్థవంతంగా పనిచేస్తుంది.
టూత్ పేస్ట్ తో బ్రష్ చేయడానికి ముందు అరచేతిలోకి కొద్దిగా బొగ్గు పొడిని తీసుకొని చేతివేళ్ళతో పళ్ళు తోముకోవాలి. ఆ తర్వాత మీరు రెగ్యులర్ గా ఉపయోగించే టూత్ పేస్ట్ తో బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలు మెరుస్తూ ఉంటాయి.కొబ్బరి నూనె కూడా దంతాల మీద పేరుకుపోయిన పసుపు పచ్చ రంగును తొలగించడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ మోతాదులో కొబ్బరినూనె నోట్లో పోసుకొని పుక్కిలించాలి . అలా పది నిమిషాలు చేసిన తరువాత ఆ నూనెను ఉమ్మివేయాలి. ఆ తరువాత కొన్ని మంచినీళ్ళు నోట్లో పోసుకొని పుక్కిలించి బ్రష్ చేసుకోవాలి. ఇలా కొన్ని చిట్కాలు పాటిస్తే పసుపు పచ్చ పళ్ళు తెల్లగా మారిపోతాయి.