Knee Pians : నొప్పుల నివారిణి ఈ నూనె.. అన్ని రకాల నొప్పులు ఫటాఫట్..

Knee Pians : కానుగ చెట్లను మనం నిత్యం చూస్తూనే ఉంటాం.. రోడ్డుకిరువైపులా ఈ చెట్లు కనిపిస్తూ ఉంటాయి.. ఈ చెట్టు నిండా ఔషధ గుణాలను కలిగి ఉంది.. ఈ చెట్టు కాయల గింజల నుండి నూనెను తయారు చేస్తారు ..దానినే కానుగ నూనె అని పిలుస్తారు.. ఈ నూనె అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది..!ఆయుర్వేదం లో కానుగ నూనె పూర్వకాలం నుంచి వినియోగిస్తున్నారు. ఈ నూనెలో యాంటీ మైక్రోబయాల్ గుణాలు ఉన్నాయి.

ఈ నూనె గాయాలను నయం చేస్తుంది పుండ్లు, గాయాలు ఉన్నచోట ఈ నూనె రాసుకుంటే అవి త్వరగా తగ్గడంతో పాటు నొప్పిని కూడా తగ్గిస్తుంది. కానుగ నూనె లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ లో నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు కానుగ నూనె రాసుకుని 5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేస్తూ ఉంటే కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కండరాల వాపులను తగ్గిస్తుంది. ఊపిరితిత్తులలో నీరు చేరడం,

Knee Pians To Check Kanuga Oil
Knee Pians To Check Kanuga Oil

జలుబు వంటి సమస్యలు ఉన్నప్పుడు కానుగ నూనెను చాతిమీద రావడం వల్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.గోరు వెచ్చటి నీటిలో రెండు చుక్కలు ఈ నూనె వేసుకుని స్నానం చేస్తే అన్ని రకాల శారీరక నొప్పులు తొలగిపోయి మానసిక స్వాంతతను అందిస్తుంది. తల నొప్పితో ఉన్న వారు నుదుటి పైన రెండు చుక్కలు ఈ నూనె రాసుకుని మసాజ్ చేసుకుంటే తల నొప్పినుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ నూనెను అనేక రకాల సబ్బులు తయారీలో ఉపయోగిస్తారు. కానుగనూనె ను దీపారాధన కు ఉపయోగిస్తారు.